Share News

Anagani Satya Prasad on Google AI Hub: విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

ABN , Publish Date - Oct 14 , 2025 | 04:19 PM

విశాఖపట్నానికి గూగుల్ ఏఐ హబ్‌ రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచుతుందని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నానికి రావడం నవ్యాంధ్రప్రదేశ్‌కు శుభపరిణామమని అభివర్ణించారు.

Anagani Satya Prasad on Google AI Hub:  విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
Minister Anagani Satya Prasad on Google AI Hub

కర్నూలు, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి గూగుల్ ఏఐ హబ్‌ (Google AI Hub) రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచుతుందని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నానికి రావడం నవ్యాంధ్రప్రదేశ్‌కు శుభపరిణామమని అభివర్ణించారు. ఇవాళ(మంగళవారం) కర్నూలు జిల్లాలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


సీఎం చంద్రబాబు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలని తీసుకువచ్చి హైదరాబాద్‌ని అభివృద్ధి చేశారని.. ఇవాళ విశాఖకు గూగుల్‌ని తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని మార్చతున్నారని ప్రశంసించారు. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, సమర్థవంతమైన నాయకత్వం ఉండటంతో ఏపీకి గూగుల్, టీసీఎస్, ఆక్సెంచర్ వంటి టెక్ దిగ్గజాలు వస్తున్నాయని వివరించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.


సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రాత్రింబవళ్లు కష్టపడుతూ వివిధ కంపెనీల ప్రతినిధులతో గంటల కొద్దీ చర్చలు జరిపి ఏపీకి పరిశ్రమలను తీసుకొస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల్లో ఏపీకి రూ.11.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 9.5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని వెల్లడించారు. గూగుల్ కంపెనీ రాకతో యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు అందుతాయని తెలిపారు. సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖ నగరం.. నేడు ఏఐ, డిజిటల్ సిటీకి రాజధానిగా మారతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం

విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 04:23 PM