PM Modi Praises Google AI Hub: విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:41 PM
డైనమిక్ సిటీ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్‌ను లాంఛ్ చేయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేశారు. అన్ని కోణాలనుంచి వచ్చిన ఈ పెట్టుబడిలో గెగావాట్-స్కేల్ డేటా సెంటర్‌ల రూపంలో మౌలిక సదూపాయాలు వికసిత్ భారత్‌కి దోహదం చేస్తాయని వ్యాఖ్యానించారు.
అమరావతి, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): డైనమిక్ సిటీ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్‌ను లాంఛ్ చేయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. అన్ని కోణాల నుంచి వచ్చిన ఈ పెట్టుబడిలో గెగావాట్ - స్కేల్ డేటా సెంటర్‌ల రూపంలో మౌలిక సదుపాయాలు వికసిత్ భారత్‌కి దోహదం చేస్తాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
సాంకేతికతను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో విశాఖపట్నంలోని గూగుల్ ఏఐ హబ్ చాలా శక్తివంతంగా పనిచేస్తోందని అభివర్ణించారు. గూగుల్ ముందడుగు అందరికీ ఏఐ అనే నినాదానికి ఊతం ఇస్తోందని ఉద్ఘాటించారు. భారత పౌరులకు కటిగ్ ఎడ్జి టూల్స్ అందించడంలో ఎంతో ఉపకరిస్తోందని వివరించారు. మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి సహకరించడంతోపాటు సాంకేతికతలో ప్రపంచంలో భారత్‌ని బలంగా నిలుపుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.
ఏఐ హబ్ ఒక ల్యాండ్ మార్క్: గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్
మరోవైపు.. ఏపీలో ఏఐ హబ్, డేటా సెంటర్ ఏర్పాటుపై అంతర్జాతీయంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో గూగుల్ అండ్ ఆల్పాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడటం ఎంతో గొప్పగా ఉందని చెప్పుకొచ్చారు. మొట్టమొదటి గూగుల్ ఏఐ హబ్‌ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న సందర్బంగా తమ ప్రణాళికలు తెలియజేశానని పేర్కొన్నారు సుందర్ పిచాయ్.
ఏఐ హబ్ ఈ రంగంలో ఒక ల్యాండ్ మార్క్ అభివృద్ధిగా మారుతోందని ఉద్ఘాటించారు. ఈ హబ్‌లో గెగావాట్ - స్కేల్ కంప్యూట్ కెపాసిటీ, నూతన అంతర్జాతీయ సబ్ సీ గేట్ వే ఉన్నాయని వివరించారు. అతిపెద్ద విద్యుత్ ఆధారిత మౌలిక సదుపాయలు ఉండనున్నాయని వెల్లడించారు. తమ మెరుగైన సాంకేతికతను భారతీయ పెట్టుబడుదారులకు, ప్రజలకు అందించే కార్యక్రమం ఇదని అభివర్ణించారు. దేశం మొత్తం ఏఐని మరింత వేగవంతం చేయడంలో.. మరిన్ని పరిశోధనలకు ఇది ఆస్కారం ఇస్తోందని గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం
ప్రధాని మద్దతుతోనే సాధ్యం.. గూగుల్‌తో ఒప్పందంపై సీఎం
Read Latest AP News And Telugu News