Share News

CM Chandrababu On Google Agreement: ప్రధాని మద్దతుతోనే సాధ్యం.. గూగుల్‌తో ఒప్పందంపై సీఎం

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:10 PM

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ , కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారని సీఎం అన్నారు. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు.

CM Chandrababu On Google Agreement: ప్రధాని మద్దతుతోనే సాధ్యం.. గూగుల్‌తో ఒప్పందంపై సీఎం
CM Chandrababu On Google Agreement

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. మంగళవారం నాడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ (PM Modi) మద్దతుతో ఇది సాధ్యం అయ్యిందన్నారు. తాను చూసిన ప్రధాన మంత్రులలో మోదీ ప్రత్యేకమన్నారు. విజినరీ, ఆలోచన తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనను ఎవరూ అందుకోలేరని కొనియాడారు. ప్రధాని సారథ్యంలో 2047 కంటే ముందుగానే భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని స్పష్టం చేశారు.


కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ , కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారన్నారు. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. గూగుల్ డాటా సెంటర్‌కు అన్ని విధాల ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అనేక మార్పులు వస్తాయని... పలు కంపెనీలు గూగుల్ బాటలో పయనించే అవకాశం ఉందన్నారు. ‘don't work hard , work smart’ అని అన్నారు సీఎం. నైతిక విలువలతో కూడిన ఏఐ టెక్నాలజీ అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

రాయలసీమ అభివృద్ధి దిశగా బీజేపీ ముందడుగు: టీజీ వెంకటేష్

గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 12:40 PM