TG Venkatesh Rayalaseema Development: రాయలసీమ అభివృద్ధి దిశగా బీజేపీ ముందడుగు: టీజీ వెంకటేష్
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:56 AM
ప్రధాని పర్యటనల వల్ల కర్నూలు జిల్లాకు కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని టీజీ వెంకటేష్ అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలకు భూ కేటాయింపులు జరిగాయని.. ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి జరిగిందనని తెలిపారు.
కర్నూలు, అక్టోబర్ 14: జీఎస్టీ తగ్గిస్తే నష్టపోతామని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని... కానీ వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ధిక భరోసా ఇచ్చాక వాళ్లు కూడా ఒప్పుకున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రష్యా నుంచి తక్కువ రేటుకే చమురు కొనుగోలు చేసి పొదుపు చేసి మిగిలిన డబ్బులను జీఎస్టీ లోటును భర్తీ చేస్తున్నారని వెల్లడించారు. ప్రధాని పర్యటనల వల్ల కర్నూలు జిల్లాకు కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలకు భూ కేటాయింపులు జరిగాయని.. ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధి జరిగిందనని తెలిపారు.
40 ఏళ్ల క్రితం ఉన్న పరిశ్రమలు మాయం అయ్యాయని టీజీ వెంకటేష్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమల విప్లవం మొదలైందని... మంత్రి టీజీ భరత్ పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చాలా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రాంతాల వారిగా రీజినల్ ఆఫీసులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. హైకోర్టు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదన లేదని గత వైసీపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తోందన్నారు. ఉచిత పథకాలు... యువతకు ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం బ్యాలెన్స్‌గా వెళ్తోందన్నారు.
రాయలసీమ డిక్లరేషన్ అమలు దిశగా బీజేపీ వెళ్తోందని తెలిపారు. కర్నూలు జిల్లాలో అపారమైన బంగారు ఇతర నిక్షేపాల గనులు ఉన్నాయని.. కర్నూలు జిల్లా పరిశ్రమలకు అనుకూలమైన ప్రాంతమన్నారరు. నిరుద్యోగ భృతి కంటే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తే యువత భవిష్యత్తు బాగుంటుందని వెల్లడించారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారా అనేక పోరాటాలు చేసి ఎన్నో సాధించినట్లు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం
బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలపై రాయపాటి శైలజ ఫైర్
Read Latest AP News And Telugu News