Rayapati Shailaja Demands Apology: బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలపై రాయపాటి శైలజ ఫైర్
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:38 AM
తక్షణమే ఆయన మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని రాయపాటి శైలజ డిమాండ్ చేశారు. లేకపోతే మహిళా కమిషన్ నుంచి విచారణకు నోటీసులు అందుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమరావతి, అక్టోబర్ 14: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (Former MLA Bolla Brahmanaidu) వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ రాయపాటి శైలజ (AP Womens Commission Rayapati Shailaja) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ విమర్శల్లో మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు సిగ్గుచేటంటూ మండిపడ్డారు. మహిళలు తాగుబోతులన్న బ్రహ్మనాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని... ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఆయన మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే మహిళా కమిషన్ నుంచి విచారణకు నోటీసులు అందుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
విపరీతార్ధాలతో మహిళల ప్రవర్తనపై వర్ణణ చేయడం పైశాచికత్వ ధోరణిని తెలియజేస్తుందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడే వ్యక్యులు ఏ స్థాయి వారైనా మహిళా కమిషన్ క్షమించదని స్పష్టం చేశారు. మహిళలను కించపరిచే విమర్శల వ్యాఖ్యలను సభ్య సమాజం ఖండించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
హంగు, ఆర్భాటం లేకుండా నామినేషన్ వేయనున్న సునీత
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు తెలంగాణ సర్కార్
Read Latest AP News And Telugu News