APSRTC Konakalla Narayana: నోరు అదుపులో పెట్టుకో.. మాజీ మంత్రి జోగి రమేష్‌కు వార్నింగ్..
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:46 AM
గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్‌ను నమ్మి అనేకమంది ఇప్పుడు అధికారులు జైళ్లకు వెళ్లారని కొనకళ్ళ నారాయణ గుర్తు చేశారు. గత ఐదేళ్లల్లో మీ ధన దాహం కారణంగా ఇప్పుడూ అధికారులు, నాయకులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కృష్ణా: గత ప్రభుత్వంలో కల్తీ మద్యం తయారు చేసి దుకాణాల ద్వారా సొంత బ్రాండ్లు పెట్టి అమ్ముకుంది.. వైసీపీ నేతలే అని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణ ఆరోపించారు. కల్తీ మద్యం తాగి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 20 చనిపోయారు అది నిజం కదా..? అని నిలదీశారు. ఒక విజన్‌తో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే చూసి ఓర్వలేక ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించారు. దోచుకోవడం, దాచుకోవడం నీకు, మీ నాయకుడికి అలవాటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్‌ను నమ్మి అనేకమంది అధికారులు జైళ్లకు వెళ్లారని కొనకళ్ళ నారాయణ గుర్తు చేశారు. గత ఐదేళ్లల్లో మీ ధన దాహం కారణంగా ఇప్పుడూ అధికారులు, నాయకులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నకిలీ మద్యం తయారు చేసే చరిత్ర జగన్మోహన్ రెడ్డిదే అని ఆరోపించారు. వేలకోట్లు దోచుకున్నట్లు ఆధారాలతో పట్టుబడ్డా.. ఇంకా సిగ్గు లేకుండా ఎదురు దాడి చేస్తున్నారు అని విమర్శించారు.
ఇప్పుడు దొరికిన నకిలీ మద్యం గత ప్రభుత్వం హయాంలోనే మొదలైందని తెలిపారు. మీరే అక్రమాలును పెంచి పోషించారని మండిపడ్డారు. ఒక్కసారి అయినా ఐదేళ్లల్లో నకిలీ మద్యంపై జగన్ చర్యలు తీసుకున్నారా అని వైసీపీ నేతలను నారాయణ సూటిగా ప్రశ్నించారు. నకిలీ మద్యం ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి