Share News

Smart Projectors: స్మార్ట్ ప్రొజెక్టర్ల హవా.. ఇంట్లోనే సినిమాకు వెళ్లిన ఫీలింగ్

ABN , Publish Date - Dec 18 , 2025 | 08:15 PM

ఆధునియ యుగంలో వింతలు, విడ్డూరాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మానవ మేధస్సు ఏపాటిదో రుజువు చేస్తున్నాయి. ఔరా.. అనిపించే రేంజ్‌లో నవకల్పనలు జీవన ప్రమాణాల్ని ర్యాపిడ్ స్పీడుతో ముందుకు తీసుకెళ్తున్నాయి.

Smart Projectors: స్మార్ట్ ప్రొజెక్టర్ల హవా.. ఇంట్లోనే సినిమాకు వెళ్లిన ఫీలింగ్
Home Theatre Projectors

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 18: హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కొత్త ట్రెండ్ స్మార్ట్ ప్రొజెక్టర్లు. ఇప్పుడు హోమ్ థియేటర్ ప్రపంచాన్ని మార్చేస్తున్నాయి. సాంప్రదాయ టీవీలకు బదులుగా, ఈ పరికరాలు పెద్ద స్క్రీన్ (100-300 అంగుళాలు) అనుభవాన్ని ఇస్తున్నాయి.

బిల్ట్-ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ (Android TV లేదా Google TV)తో వచ్చే ఈ ప్రొజెక్టర్లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్‌ను డైరెక్ట్‌గా రన్ చేస్తాయి. ఎక్స్‌టర్నల్ స్ట్రీమింగ్ డివైస్ అవసరం లేదు.


ముఖ్య ఫీచర్లు:

  • ఆటో ఫోకస్ అండ్ కీస్టోన్ కరెక్షన్: సెటప్ సులభం, ఆటోమాటిక్‌గా ఇమేజ్ అడ్జస్ట్ అవుతుంది

  • వై-ఫై అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ: వైర్‌లెస్ స్ట్రీమింగ్, స్మార్ట్‌ఫోన్ నుంచి మిర్రరింగ్

  • హై రిజల్యూషన్: చాలా మోడల్స్ 4K సపోర్ట్, HDRతో షార్ప్ కలర్స్ తో మంచి అనుభూతిని ఇస్తున్నాయి

  • పోర్టబుల్ డిజైన్: బ్యాటరీతో వచ్చే మోడల్స్ బయటికి తీసుకెళ్లడానికి అనువుగా ఉంటాయి

  • బిల్ట్-ఇన్ స్పీకర్స్: మంచి సౌండ్ క్వాలిటీ (కొన్ని Harman Kardonతో)వస్తున్నాయి


2025లో పాపులర్ మోడల్స్:

XGIMI Horizon Ultra, Hisense PX3-PRO, Aurzen EAZZE D1, Samsung Freestyle 2nd Gen వంటివి టాప్ రేటింగ్స్ పొందాయి

అడ్వాంటేజెస్:

  • టీవీలతో పోలిస్తే స్మార్ట్ ప్రొజెక్టర్లు చవకగా, పోర్టబుల్‌గా ఉంటాయి. గోడపై పెద్ద సినిమా థియేటర్ అనుభూతినిస్తాయి. లేజర్ లైట్ సోర్స్ మోడల్స్ 20,000 గంటల వరకు లాంగ్ లైఫ్ ఇస్తాయి. ఇంట్లో మూవీ నైట్స్, గేమింగ్ లేదా ప్రెజెంటేషన్స్‌కు ఐడియల్.

  • పోర్టబుల్ మోడల్స్‌తో బయట క్యాంపింగ్‌లో కూడా ఎంజాయ్ చేయవచ్చు. రూ. ఐదు వేల నుంచి వివిధ కంపెనీ ప్రొజెక్టర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.


Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

For More Latest News

Updated Date - Dec 18 , 2025 | 09:38 PM