Chanakya Niti On Destiny: జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:03 PM
జీవితంలో కొన్ని విషయాలు ముందే నిర్ణయించబడి ఉంటాయని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. ఆయన ఏ విషయాల గురించి ఇలా చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: కృషి, దృఢ సంకల్పం ఉంటే, మన జీవితంలో ఏదైనా సాధించగలం. మన జీవితాన్ని మార్చుకోగలం అని అంటారు. అవును, విజయం కృషితో సాధ్యమే. మన జీవితాన్ని మనం కోరుకున్న విధంగా మార్చుకోవచ్చు. కానీ, జీవితంలో జరిగే కొన్ని విషయాలను మార్చలేం. అవి అదృష్టం, విధిపై మాత్రమే ఆధారపడి ఉంటాయి అని ఆచార్య చాణక్యుడు చెప్పారు. కాబట్టి, జీవితంలో జరిగే ఏ విషయాలను మనం మార్చలేమో, ఏ విషయాలు పుట్టుకకు ముందే నిర్ణయించబడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వయస్సు:
ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడనేది అతను పుట్టకముందే, తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించబడుతుందని చాణక్యుడు చెప్పారు. మీరు ఎంత డబ్బు ఖర్చు చేసినా లేదా ఎంత కష్టపడినా జీవితకాలాన్ని పెంచుకోలేరు. ఇది ముందుగానే నిర్ణయించబడి ఉంటుందని చాణక్య అంటున్నారు.
జ్ఞానం:
తెలివితేటలు, అవగాహన సామర్థ్యం పుట్టుకకు ముందే నిర్ణయించబడుతుందని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. కొంతమందికి లోతైన ఆలోచనా శక్తి ఉంటుంది. మరికొందరు త్వరగా నేర్చుకునే శక్తి కలిగి ఉంటారు. ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుంది, దానిని గుర్తించి సరైన దిశలో పనిచేయడం ద్వారా మరింత మెరుగుపరచవచ్చని చాణక్య అంటున్నారు.
మరణం:
ఒక వ్యక్తి ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతాడో ఎవరూ ఊహించలేరు. ఇదంతా విధిలో రాసి పెట్టి ఉంటుందని ఆచార్య చాణక్యుడు అంటున్నారు. మరణ సమయం ముందే నిర్ణయించబడుతుంది. సమయం వచ్చినప్పుడు, దానిని ఎవరూ ఆపలేరని తన నీతి శాస్త్రంలో పేర్కొన్నారు.
కర్మ:
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసే అన్ని కర్మలు ముందుగా నిర్ణయించబడతాయి. కర్మలు అతను పుట్టకముందే అతని విధిలో రాసి ఉంటుందని ఆచార్య చాణక్యుడు అంటున్నారు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For MOre Latest News