Share News

GenAI Learning India: ఏఐ బాట పడుతున్న భారతీయులు.. ప్రపంచంలోనే నెం.1

ABN , Publish Date - Dec 15 , 2025 | 07:24 AM

భారతీయుల్లో జెన్ఏఐపై ఆసక్తి అధికంగా ఉన్నట్టు కోర్సెరా లర్నింగ్ ట్రెండ్స్ నివేదికలో తాజాగా తేలింది. జెన్ ఏఐ (జెనరేటివ్ ఏఐ) కోర్సుల్లో చేరుతున్న వారిలో భారతీయులు ప్రస్తుతం టాప్‌లో ఉన్నట్టు తెలిపింది.

GenAI Learning India: ఏఐ బాట పడుతున్న భారతీయులు.. ప్రపంచంలోనే నెం.1
India Leads in Gen AI Learning

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ సాంకేతికతపై పట్టు సాధించాలన్న తపన భారతీయుల్లో మెండుగా ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. ప్రముఖ ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్ కోర్సెరాలో జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) కోర్సులు ఎంచుకుంటున్న వారిలో భారతీయులు టాప్‌లో ఉన్నారు. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఈ ఏడాది 3.5 మిలియన్‌ల మంది ఏఐ కోర్సులను ఎంచుకున్నట్టు సంస్థ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో ఏఐ వినియోగం భారీగా పెరుగుతోందనడానికి ఇది ముఖ్య సంకేతమని కోర్సెరా-2025 లెర్నర్స్ రిపోర్టు వెల్లడించింది (Indian Leads in Gen AI Learning).

వివిధ కోర్సుల్లో చేరిన మొత్తం 32.8 మిలియన్ లెర్నర్లలపై ఈ సర్వే నిర్వహించారు. భారతీయుల్లో జెన్ ఏఐ పట్ల ఆసక్తి అత్యధికంగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ప్రాథమిక ఏఐ కోర్సులతో పాటు అడ్వాన్స్‌డ్ జెన్ ఏఐ కోర్సుల్లో కూడా భారతీయులు పెద్ద సంఖ్యలో చేరుతున్నట్టు నివేదిక వెల్లడించింది. నిమిషానికి ముగ్గురు చొప్పున ఈ కోర్సుల్లో చేరుతున్నారని, గతేడాది గణాంకాలతో పోలిస్తే ఇది ఎక్కువని తెలిపింది. ఏఐ ప్రాథమిక అంశాలు, వినియోగం వంటి కోర్సులపై ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు తేల్చింది.


ఏఐతో పాటు డేటా, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, ప్రాజెక్టు ఎగ్జిక్యూటింగ్, ఫైనాన్స్ విభాగాల్లోని కోర్సులపై కూడా భారతీయులు అధిక ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా భారతీయుల ఎంపిక ఉందని సంస్థ నివేదికలో పేర్కొంది.

ఇక ఏఐ కోర్సులు నేర్చుకున్న వారి కెరీర్‌లో వృద్ధినమోదైనట్టు కూడా నివేదిక పేర్కొంది. ఈ కోర్సులు చేసిన భారతీయుల్లో 55 శాతం మంది తమకు శాలరీ పెరిగిందని, 96 శాతం మంది తమకు ఆత్మవిశ్వాసం, లక్ష్యాలను చేరుకున్నామన్న సంతృప్తి కలిగిందని చెప్పారు.

కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ యంగ్ నివేదిక ప్రకారం, జెన్ ఏతో సుమారు 38 మిలియన్‌ల జాబ్స్‌పై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది. 2030 కల్లా జీడీపీ 1.5 ట్రిలియన్ డాలర్ల మేర పెరిగే ఛాన్స్ ఉంది.


ఇవీ చదవండి:

ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. కొత్త ఐఓఎస్ వచ్చేసిందిగా..

ఏఐతో ఉద్యోగాల కోతలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Dec 15 , 2025 | 07:46 AM