Home » Artificial Intelligence
ఏఐ సాంకేతిక అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నివేదిక తాజాగా వెల్లడించింది.
భారతీయుల్లో జెన్ఏఐపై ఆసక్తి అధికంగా ఉన్నట్టు కోర్సెరా లర్నింగ్ ట్రెండ్స్ నివేదికలో తాజాగా తేలింది. జెన్ ఏఐ (జెనరేటివ్ ఏఐ) కోర్సుల్లో చేరుతున్న వారిలో భారతీయులు ప్రస్తుతం టాప్లో ఉన్నట్టు తెలిపింది.
ఏఐతో లేఆఫ్స్ పెరుగుతున్నాయన్న భయాల నడుమ ఐబీఎమ్ సీఈఓ అరవింద్ కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యోగ నియామకాలకు ప్రస్తుతం దిద్దుబాట్లు చూస్తున్నామని అన్నారు. ఏఐతో ప్రభావం కొంత ఉన్నప్పటికీ అదొక్కటే ప్రధాన కారణం కాదని అన్నారు.
అమెరికాలో ప్రస్తుతమున్న జాబ్స్‌లో 12 శాతం ఏఐతో భర్తీ చేయొచ్చని ఎమ్ఐటీ పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. 1.2 ట్రిలియన్‌ల వార్షిక ఆదాయం చెల్లించాల్సిన జాబ్స్ ఏఐతో భర్తీ చేయొచ్చని పరిశోధకులు తమ అధ్యయనంలో అంచనాకు వచ్చారు.
ఏఐ చెప్పిందల్లా నిజమని భావించొద్దని ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. అత్యాధునిక ఏఐ సాంకేతికత కూడా ప్రస్తుతం తప్పులు చేసే అవకాశం ఉందని అన్నారు.
ఏఐ రంగంలోకి వచ్చిపడుతున్న పెట్టుబడులపై ఇప్పటికే అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన మేర రాబడులు లేక ఈ ఆశల బుడగ బద్దలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే మొదటగా పర్‌ప్లెక్సిటీ సంస్థ విఫలమయ్యే అవకాశం ఉందని ఇటీవల జరిగిన ఓ పోల్‌లో ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు.
భారతీయ ఉద్యోగులు ఏఐ సాధనాలను విశ్వసనీయ వర్క్ పార్ట్‌నర్లుగా చూస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఏకంగా 71 శాతం మంది భారతీయ వర్కర్లు ప్రస్తుతం తమ విధినిర్వహణలో భాగంగా ఏఐని వినియోగిస్తున్నారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ అభివృద్ధిపై నిషేధం విధించాలని పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులు డిమాండ్ చేశారు. మానవుల స్థానాన్ని భర్తీ చేసే సాంకేతికత అవసరం లేదని చెప్పారు.
దేశవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ వస్తుండగా, మరికొన్ని ఏఐ రంగాల్లో మాత్రం అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యువత కొత్త టెక్నాలజీ నేర్చుకుని, స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కెరీర్‌ను నిర్మించాలనుకునే విద్యార్థులకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఓపెన్‌ఏఐ అకాడమీ, నెక్స్ట్‌వేవ్ (NIAT) కలిసి ప్రారంభించిన జెన్ ఏఐ బిల్డ్‌థాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న ఆసక్తిగల యువతను ఆహ్వానిస్తోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.