మరో రెండు మూడేళ్లల్లో కీబోర్డ్స్ కనుమరుగు: ఎస్ఏపీ సంస్థ సీఈఓ
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:23 PM
ఏఐ ఆధారిత వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని ఎస్ఏపీ సంస్థ సీఈఓ క్రిస్టియన్ క్లైన్ అన్నారు. మరో రెండు మూడేళ్లల్లో కీబోర్డ్స్ కనుమరుగవుతాయని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు మూడేళ్లల్లో కీబోర్డ్స్ నిరర్థకంగా మారిపోతాయని ఎస్ఏపీ సంస్థ సీఈఓ క్రిస్టియన్ క్లైన్ అభిప్రాయపడ్డారు. ఏఐ ఆధారిత వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగం పెరిగాక కీబోర్డ్స్ అవసరం తీరిపోతుందని అన్నారు. ఈ టెక్నాలజీ మనుషుల మాటల్ని గుర్తించి అక్షరాలుగా మారుస్తుందని చెప్పారు. అన్ని డివైజుల్లో ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. మైక్‌లో మాట్లాడగానే వాక్యాలు వాటంతట అవే కనిపిస్తాయని తెలిపారు (Christian Klein on Keyboards).
‘త్వరలో కీబోర్డు కథ ముగిసిపోతుంది. మనుషుల మాటల్ని గుర్తించే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఏఐ) చాలా సమర్థవంతంగా మారాయి. ఇక మనుషుల సంభాషణల్ని వ్యాపార అవసరాలకు తగిన తీరులోని మార్చాల్సి. భవిష్యత్తులో మా సంస్థకు చెందిన సాఫ్ట్‌వేర్‌లల్లో ఎలాంటి డేటా టైప్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సాఫ్ట్‌వేర్‌కు సూచనలు ఇచ్చి పని చేయించుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ తో మాట్లాడి డేటా ఎంట్రీ చేయించుకోవచ్చు. ఇందుకు సంబంధించి సాంకేతిక అందుబాటులో ఉంది. దీన్ని అమలు చేయడమే మిగిలుంది’ అని అన్నారు.
కంపెనీలు తమ విభాగాలన్నిటి ఏఐని వినియోగిస్తే ప్రయోజనాలు అధికంగా ఉంటాయని ఆయన అభిప్రాయ పడ్డారు. కొన్ని విభాగాల్లోనే ఏఐని వినియోగిస్తున్న సంస్థ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఏఐతో ఆశించిన ఫలితంగా లేదన్న భావనలో ఉన్నాయని వివరించారు. ఏఐని కేవలం కొన్ని విభాగాలకే పరిమితం చేయడంతో ఉపయోగం ఉండదని అన్నారు. శక్తిమంతమైన ఏఐని సరైన విధానంలో వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి
ప్రియుడి బండారం బయటపెట్టిన చాట్‌జీపీటీ.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..
వన్‌ప్లస్ మూసివేత రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ సీఈఓ