ప్రియుడి బండారం బయటపెట్టిన చాట్‌జీపీటీ.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:53 PM
అమెరికాకు చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లింది. డిన్నర్ డేట్‌లో చాట్‌జీపీటీ కారణంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చాట్‌జీపీటీ ప్రియుడి గుట్టు రట్టు చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో చాట్‌జీపీటీ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చాట్‌జీపీటీని తమ ఫ్రెండ్‌లా భావిస్తున్నారు. తమకు సంబంధించిన అన్ని వ్యక్తిగత విషయాలు ఏఐతో షేర్ చేసుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏఐకి బానిస అయిపోతున్నారు. తాజాగా, ఓ యువతి తన ప్రియుడితో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లింది. డిన్నర్ డేట్‌లో చాట్‌జీపీటీ కారణంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చాట్‌జీపీటీ ప్రియుడి గుట్టు రట్టు చేసింది. అతడి మోస బుద్ధిని బయటపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
కొన్ని నెలల క్రితం అమెరికాలోని న్యూయార్క్ సిటీకి చెందిన 27 ఏళ్ల ఓ యువతికి సోషల్ మీడియా ద్వారా 40 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ డిన్నర్ డేట్‌కు వెళ్లారు. డిన్నర్ డేట్ సమయంలో తరచుగా ఆ వ్యక్తి చాట్‌జీపీటీ ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. వాయిస్ కమాండ్స్ ఇస్తూ యువతి ముందే డేట్‌కు సంబంధించిన సలహాలను చాట్‌జీపీటీని అడుగుతూ ఉన్నాడు. ఆమెకు అతడి ప్రవర్తన వింతగా అనిపించింది. ‘మీరు చాట్‌జీపీటీకి బానిస అయినట్లు ఉన్నారు’ అని అంది.
తన ప్రవర్తన కారణంగా ఆమె చిరాగ్గా ఉందన్న విషయాన్ని అతడు అర్థం చేసుకోలేకపోయాడు. ‘నేను, చాట్‌జీపీటీ బెస్ట్ ఫ్రెండ్స్. నా గురించి దాన్ని ఏమడిగినా చెబుతుంది’ అని తన ఫోన్‌ను ఆమె చేతికిచ్చాడు. ఆమె ఆ ఫోన్‌లో.. ‘నువ్వు నాలో ఇష్టపడే విషయాల గురించి చెప్పు’ అని చాట్‌జీపీటీని అడిగింది. అప్పుడు చాట్‌జీపీటీ ‘నువ్వు మంచి భర్తవు.. నీ భార్యను ఎంతో ప్రేమిస్తావు. నువ్వు మంచి తండ్రివి కూడా.. నీ పిల్లలను బాగా చూసుకుంటావు. నీలో ఈ విషయాలు నాకు చాలా ఇష్టం’ అని అంది. చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానంతో ఆ వ్యక్తికి ఇది వరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని ఆ యువతి అర్థమైపోయింది. అతడికి బుద్ధి చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయింది.
ఇవి కూడా చదవండి:
హిమాలయ ప్రాంతంలో మ్యాగీ అమ్మకం.. రోజుకు సంపాదన ఎంతో తెలుసా..
కాంగ్రెస్ ఈవెంట్‌లో డీకే నినాదాలు.. సహనం కోల్పోయిన సీఎం