హిమాలయ ప్రాంతంలో మ్యాగీ అమ్మకం.. రోజుకు సంపాదన ఎంతో తెలుసా..
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:48 PM
ఎక్కడ ఏ వ్యాపారం చేయాలో తెలిస్తే సగం విజయం వరించినట్టే. ఎక్కడ ఏ వస్తువుకు డిమాండ్ ఉంటుందో ఊహించి ముందు అడుగు వేస్తే భారీ సంపాదన జేబులో పడినట్టే. తాజాగా ఓ వ్యక్తి అలాగే ఆలోచించి తక్కువ వ్యవధిలోనే లక్షల రూపాయలు సంపాదించాడు.
ఎక్కడ ఏ వ్యాపారం చేయాలో తెలిస్తే సగం విజయం వరించినట్టే. ఎక్కడ ఏ వస్తువుకు డిమాండ్ ఉంటుందో ఊహించి ముందు అడుగు వేస్తే భారీ సంపాదన జేబులో పడినట్టే. తాజాగా ఓ వ్యక్తి అలాగే ఆలోచించి తక్కువ వ్యవధిలోనే లక్షల రూపాయలు సంపాదించాడు. బాదల్ ఠాకూర్ అనే వ్యక్తి హిమాలయ పర్వత ప్రాంతాలలో మ్యాగీని అమ్ముతూ తక్కువ రోజుల్లో లక్షల రూపాయలు ఆర్జించాడు. అతడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (selling Maggi in mountains).
బాగా చల్లగా ఉండే పర్వత ప్రాంతాలలో మ్యాగీని అమ్మడం కూడా బంగారు గని అని బాదల్ ఠాకూర్ తన ప్రయోగం ద్వారా నిరూపించాడు. కేవలం ఒక సిలిండర్, స్టవ్ పట్టుకొచ్చి మ్యాగీ తయారు చేస్తున్నాడు. ఒక రోజులో 300కి పైగా మ్యాగీ ప్లేట్లను అమ్మడం ద్వారా సుమారు రూ.21,000 సంపాదిస్తున్నాడు. ఒక సాదా మ్యాగీ ప్లేట్ రూ.70కి, ఛీజ్‌తో కూడిన ప్లేట్ రూ.100కు విక్రయిస్తున్నాడు. అతను నాలుగు నుంచి ఐదు గంటల్లో 200 మ్యాగీ ప్లేట్లను, రోజంతా 300 నుంచి 350 ప్లేట్లను విక్రయిస్తున్నాడు (viral business idea).
పర్వత ప్రాంతాలలో విహారానికి వచ్చిన టూరిస్ట్‌లు అతడి వేడి వేడి మ్యాగీ తినడానికి ఎగబడుతున్నారు (unique ways to earn money). దీంతో చలికాలంలో హిమాలయ పర్వత ప్రాంతంలో మ్యాగీ అమ్మాలనే అతడి ఆలోచన సూపర్ హిట్ అయింది. అతడి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అతడి ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సూపర్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి.. ప్లాస్టిక్ టబ్‌లు ఇంత గట్టిగా ఉంటాయా..
చిలుకల మధ్యలో సీతాకోక చిలుక.. 15 సెకెన్లలో ఆ సీతాకోకచిలుకను కనిపెట్టండి..