Alexa Plus on Web: అమెజాన్ అలెక్సా వాడేవారికి ఓ గుడ్ న్యూస్..
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:50 PM
అలెక్సా వాడే వినియోగదారులకు ఓ గుడ్‌న్యూస్. చాట్‌జీపీటీలా వెబ్‌పోర్టల్‌లో చాట్ చేసేందుకు వీలుగా అలెక్సా ప్లస్ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇదీ ఎర్లీ యాక్సెస్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెజాన్ అలెక్సా గురించి అందరికీ తెలిసిందే. ఈ వాయిస్ అసిస్టెంట్‌తో ఎన్నో పనులు చక్కబెట్టుకోవచ్చు. గతేడాది అలెక్సాకు ఏఐ ఫీచర్లు కూడా జత అయ్యాయి. అయితే, వెబ్‌పోర్టల్ ద్వారా అలెక్స్‌తో చాటింగ్‌కు ఎలాంటి అవకాశం లేకపోవడంతో యూజర్లు చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీన్ని గుర్తించిన అమెజాన్ తొలిసారిగా వెబ్‌పోర్టల్ ఆధారిత అలెక్సా ప్లస్‌ను లాంఛ్ చేసింది (Alexa Plus on Web).
ఏమిటి దీని ప్రత్యేకత
చాట్‌జీపీటీ, జెమినై వంటి చాట్‌బాట్స్ ప్రస్తుతం యాప్‌లతో పాటు వెబ్‌పోర్టల్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. అలెక్సా ప్లస్ కూడా ఇదే రూట్‌లో ముందడుగు వేసింది. ఇటీవలే అలెక్సా ప్లస్ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఇది చూడటానికి చాట్‌జీపీటీ, జెమినై వంటి చాట్‌బాట్‌ల ఇంటర్‌ఫేస్ మాదిరిగానే ఉంటుంది.
అంటే, వినియోగదారులు తమ సందేహాలను నేరుగా వెబ్‌పోర్టల్‌లో టైప్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. వెబ్‌పోర్ట్‌లోని సైడ్‌బార్‌లో మీరు గతంలో చేసిన చాట్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ప్రాథమిక స్థాయి స్మార్ట్ హోమ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. యూజర్ల షెడ్యూల్ కోసం కాలెండర్, రిమైండర్స్ ఉంటాయి. అలెక్స్ విశ్లేషించేందుకు వీలుగా ఈ వెబ్‌పోర్టల్ ద్వారా ఫైల్స్‌ను కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్‌లోప్ ఫీచర్ జనాలకు అమితంగా నచ్చుతుందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
ఈ వెబ్‌పోర్టల్ ద్వారా యూజర్లు అలెక్సాతో తమకు నచ్చిన లెటర్లు రాయించుకోవడం వంటి పనులు చేయొచ్చు. అందులోని విషయాలను సులువుగా కాపీ చేసుకుని మీ నోట్ ప్యా్డ్ లేదా వర్డ్ ప్యాడ్‌లో కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్స్‌కు సంబంధించిన ఫైల్స్ అప్‌లోడ్ చేసి ఇన్‌స్టాలేషన్‌కు సంబంధించి కావాల్సిన సలహాలు కూడా తీసుకోవచ్చు. అయితే, చాట్‌జీపీటీలో కనిపించే కస్టమ్ యాప్స్, జెమినైలోని జెమ్స్ వంటి ఫీచర్లు ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేవు. ఎక్స్ ఫైల్స్‌ను కూడా ప్రస్తుతానికి అలెక్సాలో వాడుకునే అవకాశం లేదు. కాన్వా, వీడియో జనరేటర్, గైడెడ్ లర్నింగ్ మోడ్ వంటీ ఫీచర్లూ ప్రస్తుతానికి లేవు. అయితే, ఈ ఫీచర్లన్నీ భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అలెక్సా ప్లస్ వెబ్ పోర్టల్ ఎర్లీ యాక్సెస్ వెసులుబాటు మాత్రమే ఉంది. అంటే, ఇది కొందరికే అందుబాటులో ఉందన్నమాట. అయితే, భవిష్యత్తులో ఇది అమెజాన్ ప్రైమ్ వినియోగదారులతో పాటు సబ్‌స్క్రిప్షన్ తీసుకునే సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.
ఇవీ చదవండి:
ఏఐ బాట పడుతున్న భారతీయులు.. ప్రపంచంలోనే నెం.1
ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. కొత్త ఐఓఎస్ వచ్చేసిందిగా..