Share News

Instagram hashtags: బిగ్ అలర్ట్.. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ల వాడకంపై పరిమితి..

ABN , Publish Date - Dec 19 , 2025 | 06:41 PM

హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై పరిమితులు విధిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త మార్పులను ప్రకటించింది. కంటెంట్‌కు సంబంధం లేకపోయినా చాలా మంది ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లను జోడించేస్తుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Instagram hashtags: బిగ్ అలర్ట్.. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ల వాడకంపై పరిమితి..
Instagram creators update

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలనే ఉద్దేశంతో చాలా మంది యూజర్లు రీల్స్‌, పోస్టుల్లో అవసరానికి మించి హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగిస్తుంటారు. కంటెంట్‌కు సంబంధం లేకపోయినా ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లను జోడించేస్తుంటారు. తద్వారా తమ పోస్ట్‌ మరింత మందికి చేరుతుందని భావిస్తుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై పరిమితులు విధిస్తూ కొత్త మార్పులను ప్రకటించింది (Instagram hashtag limit).


ఇన్‌స్టాగ్రామ్ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై రీల్స్‌ అయినా, సాధారణ పోస్టులైనా గరిష్ఠంగా ఐదు హ్యాష్‌ట్యాగ్‌లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. 2011లో ఇన్‌స్టాగ్రామ్‌ తొలిసారిగా హ్యాష్‌ట్యాగ్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఒక్కో పోస్ట్‌కు గరిష్ఠంగా 30 హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించే వెసులుబాటు ఉండేది. అయితే ఈ అవకాశాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. కంటెంట్‌కు సంబంధం లేని హ్యాష్‌ట్యాగ్‌లను జోడిస్తూ రీచ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిపై నియంత్రణ అవసరమని ఇన్‌స్టాగ్రామ్‌ భావించింది (Instagram new rules).


ఇకపై ఐదు హ్యాష్‌ట్యాగ్‌లకే అనుమతి ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది (hashtag stuffing ban). సాధారణంగా ట్రెండింగ్‌లో ఉండే వాటి కన్నా కంటెంట్‌కు నేరుగా సంబంధం కలిగిన టార్గెటెడ్‌ హ్యాష్‌ట్యాగ్‌లను వాడితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని కంటెంట్‌ క్రియేటర్లకు సూచించింది. ఏ రంగానికి సంబంధించిన కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నారో దానికే సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు వాడడం మేలని తెలిపింది. అయినా ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌కు రీచ్‌ లేదా విజిబిలిటీ రావడానికి హ్యాష్‌ట్యాగ్‌లే ప్రధాన ప్రమాణికం కాదని పేర్కొంది.


Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

For More Latest News

Updated Date - Dec 19 , 2025 | 06:52 PM