Maharashtra Local Body Polls: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో కూటమికి భారీ విజయం
ABN , Publish Date - Dec 22 , 2025 | 09:16 AM
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించి మరోసారి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.
మహారాష్ట్రలో నిన్న ఆదివారం జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి(బీజేపీ, శివసేన,ఎన్‌సీపీ) 288 మున్సిపల్ కౌన్సిల్స్, నగర పంచాయతీలకు జరిగిన పోటీలో కూటమి 207 స్థానిక సంస్థల అధ్యక్ష పదవులు గెల్చుకుంది. అంటే దాదాపు 70 శాతం విజయాన్ని కైవసం చేసుకుంది. మహావికాస్ అఘాడియా (ఎంవిఏ, కాంగ్రెస్, శివసేన UBT, ఎన్సీపీ శరత్ పవార్) సమిష్టిగా పోరాడినా 44 స్థానాలకే పరిమితం అయ్యింది. కూటమి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నగర పంచాయతీలలో పట్టు నిరూపించుకుంది. రాబోయే అసెంబ్లీ లేదా ఇతర ప్రధాన ఎన్నికలకు ముందు ఈ మున్సిపల్ కౌన్సిల్ ఫలితాలు ఒక సెమీ ఫైనల్ లాంటివి అంటారు.
బీజేపీ 117 మున్సిపల్ అధ్యక్ష పదవులు గెల్చుకుంటే, శివసేన 53, ఎన్సీపీ 37 పదవులు గెల్చుకున్నాయి. కాంగ్రెస్ 28, ఎన్సీపీ(SP) 7,శివసేన (UBT) 9 స్థానాలను గెల్చుకుంది. ఎన్నికల సంఘంలోని నమోదైన పార్టీలు 4 స్థానాలు గెలుచుకోగా, 23 మున్సిపల్ అధ్యక్ష స్థానాలు గుర్తింపు లేని రిజిస్ట్రర్డ్ పార్టీలకు దక్కాయి. 5 స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు గెల్చుకున్నారు. ఇంత గొప్ప ఘన విజయాన్ని అందించిన మహారాష్ట్ర ఓటరు మహాశయులకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి:
బీజేపీ కళ్లద్దాలతో సంఘ్‌ను చూడొద్దు