DUSU Polls: క్యాంపస్‌లో విక్టరీ ర్యాలీలను నిషేధించిన ఢిల్లీ హైకోర్టు
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:30 PM
ఢిల్లీ యూనర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు ఈనెల 18వ తేదీ గురువారంనాడు జరుగనుండగా, ఫలితాలు శుక్రవారంనాడు వెలువడతాయి. డే క్లాసెస్ వారికి ఓటింగ్ ప్రక్రియ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెనింగ్ క్లాసెస్ వారికి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓటింగ్ ఉంటుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో విజయోత్సవ ర్యాలీలపై హైకోర్టు (High Court) నిషేధం (Ban) విధించింది. డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులు, డీయూ, సివిల్ అడ్మినిస్ట్రేషన్‌లను ఆదేశించింది. సంతృప్తికరమైన పద్ధతులో ఎన్నికలు జరగకుంటే ఆఫీస్ బేరర్ల విధులను నిలిపివేస్తామని హెచ్చరించింది.
ఢిల్లీ యూనర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు ఈనెల 18వ తేదీ గురువారంనాడు జరుగనుండగా, ఫలితాలు శుక్రవారంనాడు వెలువడతాయి. డే క్లాసెస్ వారికి ఓటింగ్ ప్రక్రియ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెనింగ్ క్లాసెస్ వారికి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓటింగ్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP), కాంగ్రెస్ మద్దతిస్తున్న నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI), వామపక్షాల మద్దతున్న ఎస్‌ఎఫ్‌ఐ-ఏఐఎస్ఏ (SFI-AISA) కూటమి మధ్య జరుగనుంది. డీయూఎస్‌యూ ప్రెసిడెంట్ పదవికి జోస్లిన్ నందిత చౌదరి (ఎన్ఎస్‌యూఐ), అంజలి (ఎస్‌ఎఫ్ఐ-ఏఐఎస్ఏ), ఆర్యామాన్ (ఏబీవీపీ) పోటీ పడుతున్నారు.
ఈ ఎన్నికల్లో సుమారు 2.75 లక్షల విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నాలుగు సెంట్రల్ ప్యానల్ పోస్టులకు ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగునుండగా, కాలేజే స్థాయి ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే కొనసాగుతాయి. గత ఏడాది డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏడేళ్ల తర్వాత ఎన్ఎస్‌యూఓ తిరిగి పట్టుసాధించింది. ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పోస్టులు గెలుచుకుంది. ఏబీవీపీ ఉపాధ్యక్ష, సెక్రటరీ పదవులు నిలబెట్టుకుంది.
ఇవి కూడా చదవండి..
ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
గ్యాంగ్‌స్టర్ చోటారాజన్ బెయిలు రద్దు.. సుప్రీం సంచలన తీర్పు
Read Latest National News and Telugu News