Election Commission: ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:00 PM
ఈవీఎం బ్యాలెట్ పేపర్లు మరింత సులువుగా చదివేందుకు వీలుగా ఉండేలా నిబంధనలను ఈసీఐ సవరించింది. తొలిసారి ఈవీఎంలపై గుర్తులతోపాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఉండబోతున్నాయి.
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (EVMs)పై కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India) కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎం బ్యాలెట్ పేపర్లు చదివేందుకు మరింత సులువుగా ఉండేలా నిబంధనలను ఈసీఐ సవరించింది. తొలిసారి ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఉండబోతున్నాయి. సీరియల్ నెంబర్లను కూడా ప్రముఖంగా డిస్‌ప్లే చేయనున్నారు. తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
మారిన నిబంధనలు
కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని 49బి నిబంధన ప్రకారం ఎన్నికల కమిషన్ ప్రస్తుత నిబంధనలను సవరించింది. డిజైన్, ఈవీఎం బ్యాలెట్ పేపర్ల ప్రిటింగ్ మరింత స్పష్టతగా, రీడబిలిటీ ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను మెరుగపరచడం, ఓటర్లకు మరింత సౌలభ్యం పెరిగేందుకు ఈసీఐ గత ఆరు నెలలుగా కసరత్తు చేస్తోంది.
ఈసీఐ కొత్త నిబంధనల ప్రకారం ఈవీఎం బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల ఫోటోలు కలర్‌లో ముద్రిస్తారు. ఫోటో స్పేస్‌లో నాలుగింట మూడు వంతులు అభ్యర్థి ఫోటో ఉంటుంది. అభ్యర్థులు/నోటా సీరియల్ నెంబర్లు ఇంటర్నేషనల్ ఫారమ్ ఆఫ్ ఇండియన్ న్యూమరల్స్ పద్ధతిలో ప్రింట్ చేస్తారు. స్పష్టత కోసం అక్షరాకృతి పరిమాణం (font size)30గా, బోల్డ్‌లో ఉంటుంది. ఈవీఎం బ్యాలెట్ పేపర్లు 70 జీఎస్ఎం పేపర్‌పై ముద్రిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కోసం నిర్దిష్ట ఆర్జీబీ విలువలున్న పింక్ కలర్ పేపర్‌ను ఉపయోగిస్తారు. ఈ అప్‌గ్రేడెట్ ఈవీఎం బ్యాలెట్ పేపర్లను బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే అమల్లోకి తీసుకువస్తారు.
ఇవి కూడా చదవండి..
గ్యాంగ్‌స్టర్ చోటారాజన్ బెయిలు రద్దు.. సుప్రీం సంచలన తీర్పు
అణు బెదిరింపులకు భారత్ భయపడదు: ప్రధాని మోదీ
Read Latest National News and Telugu News