Share News

PM Modi In Dhar Rally: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం: ప్రధాని మోదీ

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:10 PM

మహిళలు, యువత, పేదలు, రైతులు వికసిత్ భారత్‌కు నాలుగు స్తంభాలని ప్రధాని మోదీ అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయులతో వికసిత్ భారత్ కోసం సంకల్పం చేశామన్నారు.

PM Modi In Dhar Rally: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం: ప్రధాని మోదీ
PM Modi In Dhar Rally

భోపాల్, సెప్టెంబర్ 17: వికసిత్ భారత్‌కు మహిళలు, యువత, పేదలు, రైతులు నాలుగు స్తంభాలని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయులతో వికసిత్ భారత్ కోసం సంకల్పం చేశామన్నారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తల్లులు, సోదరీమణులకు అంకితం చేసినట్లు ప్రకటించారు.

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశంలోని కోట్లాది మంది తల్లుల ఆశీర్వాదం ఉంటే తాను ఏదైనా సాధిస్తానని స్పష్టం చేశారు. కోటాను కోట్ల తల్లులు తనకు ఎన్నోసార్లు ఆశీస్సులు అందించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంట్లో తల్లి బాగుంటే.. ఇళ్లన్నీ బాగుంటాయని తెలిపారు.


సెప్టెంబర్ 17వ తేదీన నిజాం పాలన నుంచి హైదరాబాద్‌కు విమోచనం కలిగిందని చెప్పారు. తద్వారా నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిందన్నారు. ఆ క్రమంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.


అణు బెదిరింపులకు భారత్ భయపడదని స్పష్టం చేశారు ప్రధాని. ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పామన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌‌ హీరోలపై ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నారు. తాము బతికేది దేశం కోసమని ఆయన స్పష్టం చేశారు.


మరోవైపు మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. విశాఖలో జరుగుతున్న స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది: సీఎం రేవంత్

ప్రారంభమైన వైష్ణో దేవి యాత్ర.. భక్తులకు కీలక సూచన

Read Latest National News and Telugu News

Updated Date - Sep 17 , 2025 | 04:19 PM