Home » Elections
తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తుంది. ఇప్పటి వరకు గెలిచిన కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ముందంజలో ఉంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులు రెండోస్థానంలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా సీతారామపురంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది.
ఓట్ల రక్షణ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణ కోసం తాము పోరాడుతామని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు మోదీ, అమిత్ షాలపై నమ్మకం పోయిందని ఎద్దేవా చేశారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రె్‌సదే పైచేయి అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న పట్టును నిలబెట్టుకుంటూ మెజారిటీ సర్పంచ్ స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకుంది.......
తెలంగాణలో తొలి దశ పంచాయతీ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
ఓట్ల కోసం కాసుల వేట మొదలైంది. మొదటి విడత ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండడంతో... ఉమ్మడి జిల్లాలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులకు 'డబ్బు' టెన్షన్ మొదలైంది. ఇప్పటికే వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు సొమ్ముల వేట మొదలెట్టారు.
తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్యలపై బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణపై అప్సా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గం బుధవారం సమావేశమైంది.
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. తొలి విడత ఈరోజు పూర్తి కావడంతో రెండో విడత నామినేషన్లు రేపటి నుంచి కొనసాగనున్నాయి. నామినేషన్ల సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.
మహబూబాబాద్ జిల్లా మహబూబ్ పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు ఎలా రిజర్వ్ చేశారంటూ ..