ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్..
ABN , Publish Date - Feb 11 , 2026 | 06:18 PM
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి.
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలో నిలుచున్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 13న ఓట్లు లెక్కింపు ఉంటుందని, 16న కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపారు. తుది ఓటింగ్ శాతం మరికొసేపట్లో వెల్లడి కానుంది. ఎన్నికల బరిలో ఉన్నవారి అదృష్టం ఈనెల 13న తేలబోతుంది.
ఇవి కూడా చదవండి...
ఎమ్మెల్యే సతీమణి డిజైనర్ స్టోర్‌లో చోరీ.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
Read Latest Telangana News And Telugu News