Share News

విజయ్ ఓట్లు చీల్చే వ్యక్తే కానీ కింగ్ కాలేరు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్

ABN , Publish Date - Jan 31 , 2026 | 09:39 PM

తమిళగ వెట్రి కళగంతో బీజేపీ పొత్తు అవకాశాలు, రాజకీయాల్లో విజయ్ ప్రభావం ఏమేరకు ఉండనుందనే అంశాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయ్ ఓట్లు చీల్చే వ్యక్తే కానీ కింగ్ కాలేరు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్
Piyush Goyal and TVK Vijay

న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ (Vijay) తమిళగ వెట్రి కళగం (TVK)తో బీజేపీ పొత్తు అవకాశాలు, రాజకీయాల్లో విజయ్ ప్రభావం ఏమేరకు ఉండనుందనే అంశాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ టీవీకేతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని చెప్పారు. విజయ్ కేవలం ఓట్లు చీల్చే వ్యక్తిగా మిగిలిపోతారని, కింగ్ మాత్రం కాలేరని అన్నారు. గతంలోనూ చాలా మంది సినీనటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టారని, అయితే ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారని గుర్తు చేశారు.


'విజయ్ ఓట్లు చీల్చవచ్చు.. కింగ్ మాత్రం కాలేరు. గతంలో చాలా మంది నటులు వచ్చారు, వెళ్లారు. ఆ పార్టీతో బీజేపీ పొత్తుకు అవకాశం లేదు. బీజేపీ-అన్నాడీఎంకే కూటమి అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు క్షమించరు' అని పీయూష్ గోయెల్ అన్నారు. తమిళనాడులో బీజేపీ తన సొంత బలం పెంచుకుంటూ పాత మిత్రులతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుందని స్పష్టం చేసారు.


కాగా, విజయ్ టీవీకే పార్టీ అసెంబ్లీలో ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రచారం సాగిస్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని ఏలిన ద్రవిడయన్ పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేలు రెండూ బీజేపీకి లొంగిపాయాయని, డీఎంకే నేరుగా లొంగిపోతే, డీఎంకే పరోక్షంగా లొంగిపోయిందని విజయ్ ఇటీవల విమర్శించారు. టీవీకే ఏకైక ప్రత్నామ్నాయం అని అన్నారు.


ఇవి కూడా చదవండి..

ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

For More National News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 09:58 PM