Home » Piyush Goyal
సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం అభినందనీయమని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢిల్లీలో భారత్ మండపం ఉన్నట్లే ఆంధ్రా మండపం నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
తొందరపాటుతో లేదా ఒత్తిడికి తలొగ్గి భారత్ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. జర్మనీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.
మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8గా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుర్తుచేశారు. ఆర్థికవేత్తల అంచనాలను మించి ఇండియా వృద్ధి అప్రతిహతంగా సాగుతోందన్నారు. ఏదిఏమైనా భారత్ విజేతగా నిలవడం ఖాయమన్నారు.
భారత్, అమెరికా మధ్య ఆలస్యమవుతున్న వాణిజ్య ఒప్పందం చర్చలు రేపటి నుంచి ముందుకు సాగనున్నాయి. ట్రంప్ చర్యల కారణంగా అమెరికాకు భారత్ చేసే ఎగుమతులు 8.01 నుంచి 6.86 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. సెప్టెంబర్ నుంచి టారిఫ్ల పూర్తి ప్రభావం కనిపిస్తుందని..
మన దేశంలో చిన్న విషయాలకు జైలు శిక్ష విధించే చట్టాలు ఉన్నా.. వాటిని ఎవరూ ఎప్పుడూ పట్టించుకోలేదని పియూష్ గోయల్ తెలిపారు. భారతీయులను జైలులో పెట్టే అటువంటి అనవసరమైన చట్టాలను రద్దు చేసే బాధ్యతను తాను స్వయంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు.
డెడ్లైన్లను దృష్టిలో పెట్టుకుని ఏ దేశంతోనూ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోబోమని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికా ప్రతీకార సుంకాల విధింపునకు డెడ్లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక కారిడార్లలో ఎంఎస్ఎంఈలు, స్టార్ట్పల కోసం ప్రత్యేక జోన్లను కేటాయించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారులను ఆదేశించారు.
ఏపీ సీఎం చంద్రబాబు వినియోగించే హెలీకాప్టర్లో తరచుగా సమస్యలు వస్తున్నాయి. ఇవాళ మరోసారి సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్కి ఈ హెలీకాప్టర్ని ఏపీ పర్యటన నిమిత్తం కేటాయించారు. కేంద్రమంత్రి కృష్ణపట్నం పోర్టుకి వెళ్లడానికి హెలికాప్టర్ ఎక్కిన సమయంలో మొరాయించడంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
రాష్ట్రంలో అనుమతించిన విస్తీర్ణంలోనే పొగాకు సాగు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదేశించారు. చాలా చోట్ల అదనంగా పొగాకు సాగు చేస్తుండటం వల్ల సమస్యలు...