Share News

మహబూబ్‌నగర్‌ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. విజేత ఎవరంటే?

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:39 PM

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగ్గా.. వాటికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలిలా ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. విజేత ఎవరంటే?
Exit Polls

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌ ముగిసింది. ఈనెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే.. ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలను ఓసారి పరిశీలిస్తే..


ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 21 మున్సిపాలిటీలు ఉండగా.. 19 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలవనుందని, 4 స్థానాల్లో హంగ్ ఏర్పడనుందని సర్వేల ద్వారా వెల్లడైంది. అలాగే 423 వార్డులకు గానూ 376 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కూడా ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించనుందని సర్వే ఫలితాలు అంచనా వేశాయి.

గమనిక: మొత్తం 21 స్థానాలకు గానూ 19 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. జడ్చర్ల, అచ్చంపేటల్లో ఎన్నికలు జరగలేదు. అలాగే అలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఏకగ్రీవమైంది.




ఇవీ చదవండి:

చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 12 , 2026 | 12:48 PM