Home » Mahabubnagar
ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్ల విజయోత్సవ సభ మొదట మక్తల్లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
వేరే కులం యువకుడు తన కూతురిని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడన్న కక్షతో రగిలిపోయిన ఆ తండ్రి.. ఆ యువకుడి అన్నను అపహరించి దారుణంగా హత్య చేశాడు. ఈ కులోన్మాద హత్య మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది.
ప్రయాణికుల సౌకర్యార్థం కోయంబత్తూరు-మదార్ (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-మదార్ ప్రత్యేక రైలు (నం. 06181) ఈ నెల 13, 20, 27, డిసెంబరు 4 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06182) ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7 తేదీల్లో నడపనున్నట్లు వెల్లడించారు.
రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి.. అప్పులు చేసి దోపిడీ చేశారనే కారణంతోనే ప్రజలు బీఆర్ఎస్ని పక్కనబెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్రెడ్డి.
కొన్ని నెలలుగా తల్లి, కుమారుడికి గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆ గొడవల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అరబిందో కంపెనీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అరబిందో కంపెనీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించిన అనిరుద్..
పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం గోమ్టినగర్-మహబూబ్నగర్-గోమ్టినగర్ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.
రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదని అనుకున్న వారే ఇప్పుడు తన్నుకొని చస్తున్నారని.. చేసిన పాపం ఊరికేపోదని పెద్దలు అన్నట్టే జరుగుతోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని స్వయంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ఒప్పుకుంటుందని చెప్పిన డీకే అరుణ.. ' డైలాగ్స్ వద్దు.. దోషులు మీరే. కానీ.. కేసీఆర్ కు సంబంధం లేదంట.. ఇదెక్కడి చోద్యం. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు ఏలింది వాళ్ళ కుటుంబమే కదా.'
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటారం స్టేజ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందగా.. మరో ముగ్గురికు తీవ్ర గాయాలయ్యాయి.