Share News

కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన బైక్..

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:08 PM

కుక్కను తప్పించబోయి ద్విచక్రవాహనం కిందపడడంతో అక్కడికక్కడే అన్న మృతిచెందగా.. తమ్ముడికి తీవ్ర గాయాలైన విషాద సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన బైక్..

  • అన్న అక్కడికక్కడే మృతి

  • తమ్ముడికి తీవ్ర గాయాలు

వనపర్తి(మహబూబ్‏నగర్): కుక్క అడ్డం రావడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడింది. ప్రమదాంలో అన్న అక్కడికక్కడే మృతి చెందాడు. తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. వనపర్తి మండల పరిధిలోని చిన్నగుంటపల్లి శివారులో ఈ సంఘటన జరిగింది. బిజినేపల్లి మండలం మహాదేవునిపేట గ్రామానికి చెందిన అన్నాదమ్ములు శివయ్య (30), లింగమయ్య సెంట్రింగ్‌ పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు. మంగళవారం వారిద్దరూ ద్విచక్రవాహనంపై వనపర్తి(Vanaparthy)కి బయలుదేరారు.


vnp1.jfif

చిన్నగుంటపల్లి శివారులో హఠాత్తుగా కుక్క అడ్డురావడంతో, దాన్ని తప్పించబోయి బైక్‌ అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న విద్యుత్‌ స్తంభానికి ఢీకొన్నది. ప్రమాదంలో శివయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. లింగమయ్య(Lingamaiah)కు కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనపై తండ్రి పర్వతాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ రుషికేశ్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

వచ్చే ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌కు కొత్త సిలబస్‌

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2026 | 01:08 PM