నల్లమలలో పులుల గణన
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:40 PM
నల్లమల రిజర్వ్ ఫారెస్టులో పులుల గణన ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని ఈర్లపడేలు అటవీ ప్రాంతం నుంచి పులుల గణన ప్రారంభమైంది. అటవీ సిబ్బందితోపాటు వాలంటీర్లు ఈ పులుల గణనలో పాల్గొంటున్నారు.
అమ్రాబాద్ రేంజ్ అమ్రాబాద్ రేంజ్ పరిధిలో..
మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు మంగళవారం పులుల గణన ప్రారంభించారు. అటవీ సిబ్బంది, పొరుగు సేవల సిబ్బంది, వాలంటీర్లు తమకు కేటాయించిన బీట్‌లకు బృందాలుగా సోమవారం రాత్రే తరలి వెళ్లారు. మొదటి రోజైన మంగళవారం ఉదయం అమ్రాబాద్ రేంజ్(Amrabad Range) పరిధిలోని ఈర్లపడేలు అటవీ ప్రాంతంలో

ఏటీఆర్ ఫీల్ట్‌డైరెక్టర్ డాక్టర్ సునిల్ హిరామత్ సిబ్బందితో కలిసి పులుల గణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ప్రతీరోజు గణన పూర్తయిన తర్వాత బేస్ క్యాంపుల్లో బస చేసే సిబ్బందికి సరైన వసతులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో టైగర్ ఎన్‌జీవో బాపురెడ్డి, బయాలజిస్టు మహేందర్ పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.
వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
Read Latest Telangana News and National News