Special trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Dec 06 , 2025 | 07:34 AM
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి, నర్సాపూర్‌కు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు, అలాగే 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.
- చర్లపల్లి నుంచి తిరుపతి, నర్సాపూర్‌కు ప్రత్యేక రైళ్లు..
హైదరాబాద్ సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి టెర్మినల్ నుంచి రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతి(Cherlapalli to Tirupati)కి, 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు చర్లపల్లి నుంచి నర్సాపూర్‌కు రైళ్లు బయలుదేరతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి నుంచి తిరుపతికి వెళ్తున్న రైలుకు మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్డానగర్, షాద్‌నగర్, జడ్చర్ల,

మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్(Mahabubnagar, Wanaparthy, Gadwal), డోన్, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట్(Kadapa, Ontimitta, Rajampet), రేణిగుంటస్టేష్లన్లలో, నర్సపూర్ వెళ్తున్న రైలుకు నల్లగొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం ఉందని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత
రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్
Read Latest Telangana News and National News