Gold, Silver Rate on Dec 6: గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:36 AM
ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో దేశంలో వెండి ధరల్లో భారీగా కోత పడింది. బంగారం ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. మరి నేడు దేశంలో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా చుక్కలను తాకుతున్న వెండి ధర తాజాగా దిగొచ్చింది. బంగారం ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ఉదయం (డిసెంబర్ 6) 6.30 గంటలకు దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటి రేటు కంటే రూ.280 మేర పెరిగి రూ.1,29,940కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ బంగారం ధర రూ.1,19,110కు చేరింది. ఇటీవల కాలంలో పెరుగుతూ వచ్చిన వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. నిన్నటి ధరతో పోలిస్తే ఒక్కసారిగా రూ.4 వేల మేర తగ్గి రూ.1,86,900కు చేరుకుంది (Gold, Silver Rates on Dec 6).
ఇటీవల వెండి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో, వెండి ధరలు తగ్గాయి. డాలర్ కాస్తంత కోలుకోవడం కూడా వెండికి డిమాండ్ తగ్గేలా చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతపై అనిశ్చితి, మెరుగైన వెండి సరఫరా వెరసి వెండి ధరలను తగ్గేలా చేశాయి. గోల్డ్ రేట్స్ మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఏడాదిలో వెండిపై పెట్టుబడులు బంగారంతో పోలిస్తే అధిక లాభాలను ఇచ్చాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బ్లూమ్‌బర్గ్ సంస్థ నివేదిక ప్రకారం, ఈ ఏడాదిలో బంగారం ధరలు సుమారు 60 శాతం మేర పెరగ్గా వెండి ధర మాత్రం ఏకంగా 100 శాతం మేర పెరిగి ఇన్వెస్టర్లపై కనకవర్షం కురిపించింది.
వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవీ
చెన్నై: ₹1,30,900; ₹1,19,990; ₹1,00,140
ముంబై: ₹1,29,940; ₹1,19,110; ₹97,460
న్యూఢిల్లీ: ₹1,30,090; ₹1,19,260; ₹97,610
కోల్‌కతా: ₹1,29,940; ₹1,19,110; ₹97,460
బెంగళూరు: ₹1,29,940; ₹1,19,110; ₹97,460
హైదరాబాద్: ₹1,29,940; ₹1,19,110; ₹97,460
విజయవాడ: ₹1,29,940; ₹1,19,110; ₹97,460
కేరళ: ₹1,29,940; ₹1,19,110; ₹97,460
పుణె: ₹1,29,940; ₹1,19,110; ₹97,460
వడోదరా: ₹1,29,990; ₹1,19,160; ₹97,510
అహ్మదాబాద్: ₹1,29,990; ₹1,19,160; ₹97,510
కిలో వెండి ధరలు
చెన్నై: ₹1,95,900
ముంబై: ₹1,86,900
న్యూఢిల్లీ: ₹1,86,900
కోల్‌కతా: ₹1,86,900
బెంగళూరు: ₹1,86,900
హైదరాబాద్: ₹1,95,900
విజయవాడ: ₹1,95,900
కేరళ: ₹1,95,900
పుణె: ₹1,86,900
వడోదరా: ₹1,86,900
అహ్మదాబాద్: ₹1,86,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలను మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
ప్రామాణిక వడ్డీ రేటును తగ్గించిన ఆర్‌బీఐ.. రుణాలు మరింత చవక
స్టాక్ మార్కెట్‌కు రెపో బూస్ట్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి