Share News

Stock Market: మార్కెట్‌కు రెపో బూస్ట్‌

ABN , Publish Date - Dec 06 , 2025 | 03:46 AM

పపలు వర్గాల ఊహలకు భిన్నంగా ఆర్‌బీఐ రెపో రేటును 0.25ు తగ్గించడం మార్కెట్లో ఉత్తేజం నింపింది. సెన్సెక్స్‌ శుక్రవారం 447.05 పాయింట్ల లాభంతో...

Stock Market: మార్కెట్‌కు రెపో బూస్ట్‌

  • 447 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

ముంబై: పలు వర్గాల ఊహలకు భిన్నంగా ఆర్‌బీఐ రెపో రేటును 0.25ు తగ్గించడం మార్కెట్లో ఉత్తేజం నింపింది. సెన్సెక్స్‌ శుక్రవారం 447.05 పాయింట్ల లాభంతో 85,712.37 వద్ద ముగిసింది. అంతకు ముందు ఇంట్రాడేలో 531.40 పాయింట్ల లాభంతో 85,796.72 స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా 152.70 పాయింట్లు లాభపడి 26,186.45 వద్ద ముగిసింది. మార్కెట్‌ లాభపడడం వరుసగా ఇది రెండో రోజు.

బ్యాంక్‌, ఆటో షేర్ల జోరు: వడ్డీరేట్ల ప్రభావం అధికంగా ఉండే బ్యాంక్‌, ఆటో, రియల్టీ షేర్లు మాత్రం ఆర్‌బీఐ నిర్ణయంతో కొత్త ఉత్తేజం పొందాయి. బ్యాంకింగ్‌ షేర్లలో ఎస్‌బీఐ 2.46ు, బీఓబీ 1.56ు మేర లాభపడ్డాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఫెడరల్‌ బ్యాంక్‌ లాభపడిన షేర్లలో ఉన్నాయి. కాగా బ్యాంకెక్స్‌ 0.86ు లాభపడింది.

ఞఆటో షేర్లలో మారుతి సుజుకీ (1.75ు), ఐషర్‌ మోటార్స్‌ (1.54ు) అగస్థానంలో నిలిచాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, భారత్‌ ఫోర్జ్‌, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ, అశోక్‌ లేలాండ్‌, బజాజ్‌ ఆటో కూడా లాభపడ్డాయి. ఆటో ఇండెక్స్‌ 0.57ు లాభపడి 62,112.92 వద్ద ముగిసింది.

ఞరియల్టీ షేర్లలో ప్రెస్టీజ్‌ 1.99ు, డీఎల్‌ఎఫ్‌ 1.50ు మేర లాభపడగా సిగ్నేచర్‌ గ్లోబల్‌, లోధా డెవలపర్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, శోభ లిమిటెడ్‌ కూడా లాభాల్లో ముగిసాయి. ఉన్నాయి. కాగా రియల్టీ సూచీ 0.34ు మేర లాభపడింది.

ఇండిగో షేరు డౌన్‌: ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు గత నాలుగు రోజుల్లో 7ు మేరకు నష్టపోయాయి. శుక్రవారం బీఎ్‌సఈలో 1.22ు నష్టపోయిన ఈ షేరు రూ.5,371.30 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 3.15ు నష్టంతో రూ.5,266 వరకు దిగజారింది. ఎన్‌ఎ్‌సఈలో 1.27ు నష్టంతో రూ.5,367.50 వద్ద ముగిసింది. నాలుగు రోజుల్లో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.16,190.64 కోట్లు నష్టపోయి రూ.2,07,649.14 కోట్లకు దిగజారింది.

ఫారెక్స్‌ నిల్వల క్షీణత: నవంబర్‌ 28వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు 187.7 కోట్ల డాలర్ల మేరకు క్షీణించి 68,622.7 కోట్ల డాలర్లకు దిగజారాయి. బంగారం నిల్వల విలువ 161.3 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 10,579.5 కోట్ల డాలర్ల వద్ద నిలదొక్కుకుంది.

ఞఫారెక్స్‌ మార్కెట్లో అమెరికన్‌ డాలర్‌ మారకంలో రూపాయి విలువ 6 పైసలు పడిపోయి 89.95 వద్ద నిలిచింది.

Updated Date - Dec 06 , 2025 | 03:46 AM