Share News

Marital Dispute: బాబోయ్.. భార్య పుట్టింటికి వెళ్లిందని.. భర్త అలిగి ఏం చేశాడంటే..

ABN , Publish Date - Jan 03 , 2026 | 10:05 PM

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్ సమీపంలో ఉన్న సెల్ టవర్‌ను ఓ వ్యక్తి ఇవాళ (శనివారం) ఎక్కాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Marital Dispute: బాబోయ్.. భార్య పుట్టింటికి వెళ్లిందని.. భర్త అలిగి ఏం చేశాడంటే..
Marital Dispute

నారాయణపేట జిల్లా, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా (Narayanpet District) కేంద్రంలోని సఖి సెంటర్ సమీపంలో ఉన్న సెల్ టవర్‌ను (Mobile tower incident) ఓ వ్యక్తి ఇవాళ (శనివారం) ఎక్కాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అమరచింత మండలం చిన్న కడుమూరు గ్రామానికి చెందిన విష్ణు అనే వ్యక్తి, తన భార్య కోసం టవర్ ఎక్కాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. నారాయణపేట ఎస్‌ఐ విష్ణుతో మాట్లాడారు. ఆయనని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. విష్ణుకు ఎలాంటి అపాయం జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రోజుల క్రితం విష్ణు, ఆయన భార్య నవీన కలిసి నారాయణపేటలోని సఖి సెంటర్‌కు కౌన్సెలింగ్ కోసం వెళ్లారు. నవీన నర్వ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువతి. కౌన్సెలింగ్ సమయంలో ఆమె భర్తతో కలిసి ఉండలేనని తెగేసి చెప్పింది. అనంతరం ఆమె తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది.


ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన విష్ణు, భార్యను తన వద్దకు తీసుకురావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ టవర్ ఎక్కాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, సఖి సెంటర్ అధికారులు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. విష్ణును శాంతింపజేసి కిందకు దిగేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సఖి సెంటర్ ప్రతినిధులు కూడా సంఘటనపై స్పందించారు. కుటుంబ సమస్యలను చట్టపరంగా, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆవేశానికి లోనుకాకుండా అధికారుల సహకారం తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితి పోలీసుల నియంత్రణలో ఉందని అధికారులు వెల్లడించారు. ఎలాంటి అనుకోని ఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, విష్ణుతో నిరంతరంగా చర్చలు సాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అసెంబ్లీలో తేల్చుకుందాం రండి.. బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్

అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండ.. అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2026 | 10:21 PM