Srinivas Goud: ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటం: శ్రీనివాస్‌గౌడ్
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:29 PM
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనినాస్‌గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలు వలసలు పోయింది గత కాంగ్రెస్ పాలనలోనేనని ఆరోపణలు చేశారు.
మహబూబ్‌నగర్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనినాస్‌గౌడ్ (Srinivas Goud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలు వలసలు పోయింది గత కాంగ్రెస్ పాలనలోనేనని ఆరోపణలు చేశారు. ఇవాళ(మంగళవారం) మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు శ్రీనినాస్‌గౌడ్. జూరాల ప్రాజెక్టు పూర్తి చేశారంటే.. అది బీఆర్ఎస్ పుణ్యమేనని చెప్పుకొచ్చారు.స్వల్ప నీటి లభ్యత ఉన్న జూరాల వద్దని 306 టీఎంసీల నీటి లభ్యత ఉన్న శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సోర్సుగా మార్చామని స్పష్టం చేశారు.
పాలమూరు లిప్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తాము ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు కనిపించటం లేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. అన్ని రాజకీయ పార్టీ నేతలతో కలిసి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులను సందర్శిద్దామని పేర్కొన్నారు. తమ హయాంలో చేసింది తప్పని తేలితే రాజకీయాల నుంచి వైదొలగుతామని సవాల్ విసిరారు.వంద కిలోమీటర్ల దూరం బ్యాక్ వాటర్ ఉన్న సోర్సే ముఖ్యమని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి పేరు చిరస్ధాయిగా ఉండాలంటే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పదిశాతం పనులు పూర్తి చేయాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి భేషజాలానికి పోవద్దని కోరారు. కాంగ్రెస్ సర్కార్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే తాము పోరాటం చేస్తామని శ్రీనినాస్‌గౌడ్ పేర్కొన్నారు.
ఆ పథకం అట్టర్ ప్లాఫ్: లక్ష్మారెడ్డి
నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం అట్టర్ ప్లాఫ్ అని..ప్రజాధనం వృథానేనని మాజీమంత్రి లక్ష్మారెడ్డి విమర్శలు చేశారు. 47 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదంతో పాటు తక్కున నీటి లభ్యత కారణంగానే జూరాల నుంచి పాలమూరు లిప్టును శ్రీశైలానికి మార్చినట్లు తెలిపారు. ఉన్న ఆయకట్టుకు నీరు ఇవ్వలేని జూరాల నుంచి కొత్త ప్రాజెక్టుకు నీళ్లు ఎలా ఇస్తామని ప్రశ్నించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసత్యాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి సీఎం, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ తెలంగాణ రాష్ట్రంలో ఉండటం ప్రజల దౌర్భాగ్యమని విమర్శలు చేశారు. హరీశ్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పని నిరూపిస్తే తాము కాంగ్రెస్‌కు మద్దతిస్తామని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చి ఉంటే ఆరునెలల్లో పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సులతో కాంగ్రెస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని లక్ష్మారెడ్డి ఆరోపణలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. సీఎం రేవంత్‌కి కిషన్‌రెడ్డి లేఖ
విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..
Read Latest Telangana News And Telugu News