Share News

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయంటే.?

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:41 PM

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగ్గా.. వాటికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలిలా ఉన్నాయి.

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయంటే.?
Exit Polls

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌ ముగిసింది. ఈనెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే.. ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలను ఓసారి పరిశీలిస్తే..


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఫలితాలు అంచనావేస్తున్నాయి. బీఆర్ఎస్ 2 స్థానాల్లో గెలుపొందుతుందని, మరో నాలుగు చోట్ల హంగ్ ఏర్పడనుందని సర్వేలు తేలుస్తున్నాయి.

గమనిక: రామగుండం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.




ఇవీ చదవండి:

చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 12 , 2026 | 12:49 PM