ఉన్నావ్ కస్టడీ మరణం కేసు.. కుల్దీప్ సెంగార్ పిటిషన్‌పై 19న ఢిల్లీ కోర్టు విచారణ
ABN , Publish Date - Feb 16 , 2026 | 06:51 PM
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి కస్టడీ మరణంపై కేసును చీఫ్ జస్టిస్ సారథ్యంలోని ధర్మాసనానికి ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు అప్పగించింది. ఈ కేసులో తనను దోషిగా నిర్ధారించడం, పదేళ్లు జైలు శిక్ష వేయడాన్ని ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ సవాలు చేశారు.
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి కస్టడీ మరణంపై కేసును చీఫ్ జస్టిస్ సారథ్యంలోని ధర్మాసనానికి ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు అప్పగించింది. ఈ కేసులో తనను దోషిగా నిర్ధారించడం, పదేళ్లు జైలు శిక్ష వేయడాన్ని ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ (Kuldeep Singh Sengar) సవాలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో చీఫ్ జస్టిస్ సారథ్యంలోని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఫిబ్రవరి 19న విచారణ జరుపనుంది.
సెంగార్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం
తనకు విధించిన పదేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేయాలంటూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్‌ను గత జనవరి 19న హైకోర్టు తోసిపుచ్చింది. దీనిని సుప్రీంకోర్టులో ఆయన సవాలు చేశారు. అయితే సుప్రీంకోర్టు సైతం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. విచారణ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బాధిత కుటుంబం అప్పీల్ చేస్తే, ఆ అప్పీల్‌ను సెంగార్ పెండింగ్ పిటీషన్‌తో కలిసి హైకోర్టు పరిశీలించవచ్చని పేర్కొంది.
ఉన్నావో అత్యాచారం కేసులో..
ఉన్నావ్ అత్యాచారం కోలులో కుల్దీప్ సెంగార్‌కు విధించిన జీవిత ఖైదును ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేయగా, ఆ ఉత్తర్వుపై గత ఏడాది డిసెంబర్ 29న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సెంగార్‌కు ఇదే తరహా మరో కేసులో దోషిగా శిక్ష పడినందున ఆయనకు హైకోర్టు ఉపసమనం ఇవ్వరాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సెంగార్‌కు నోటీసు పంపింది.
కేసు ఇదే..
2019 ఉన్నావ్ అత్యాచారం కేసులో సెంగార్ దోషిగా నిరూపితం కావడంతో ఆయన యావజ్జీవ శిక్ష పడింది. రూ.25 లక్షల జరిమానాను కూడా విచారణ కోర్టు విధించింది. అయితే ఆయనకు విధించిన యావజ్జీవ శిక్షను జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం గత డిసెంబర్ 23న సస్పెండ్ చేసింది. దీంతో సెంగార్‌కు ఉపశమనం కల్పించడంపై తక్షణం స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును సీబీఐ అశ్రయించింది.
ఇవి కూడా చదవండి..
శబరిమలలో మహిళలకు ప్రవేశం.. 9 మందితో సుప్రీం దర్మాసనం
రంగంలోకి రాహుల్.. రాజీనామాపై భూపెన్ బోరా పునరాలోచన