Kuldeep Sengar: ఉన్నావ్ కేసులో కుల్దీప్ సెంగర్‌కు బెయిల్.. సీబీఐ సీరియస్
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:25 AM
2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెగర్‌కు ఢిల్లీ హై కోర్టు బెయిల్ మంజూరు చేయడమే కాదు.. శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసు(Unnao Case)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు బీజేపీ(BJP) మాజీ ఎమ్మెల్యే, బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్(Kuldeep Singh Sengar) దాఖలు చేసిన అప్పీల్ పిటీషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హై కోర్టు (Delhi High Court) రూ.15 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు కొన్ని షరతులతో కూడిన బెయిల్(Bail) మంజూరు చేసింది. ఇప్పటికే కుల్దీప్ ఏడేళ్లు శిక్ష అనుభవించారని, అప్పీల్ తేలేవరకు శిక్షను నిలిపివేస్తున్నామని కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. కుల్దీప్ బయటకు వస్తే కేసుపై ప్రభావం పడే అవకాశముందని సీబీఐ వాదిస్తోంది. అంతేకాకుండా.. బాధితురాలి భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సెంగర్ శిక్షను సస్పెండ్ చేస్తూ హై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు సీబీఐ ఈరోజు(శనివారం) వెల్లడించింది. 2017లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక మైనర్ బాలికపై అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ తన నివాసంలో అత్యాచారానికి పాల్పపడ్డాడు. 2018 డిసెంబర్‌లో ట్రయల్ కోర్టు సెంగర్‌ను దోషిగా నిర్ధారిస్తూ జీవితఖైదు విధించింది. కుల్దీప్‌కు బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు సహా ఆమె బంధువులు కోర్టు తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీని కలిసి తన బాధను వ్యక్తం చేసింది బాధితురాలు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని, ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రిని కూడా కలుస్తామని తెలిపింది. నిందితుడికి బెయిల్ రావడంపై తన కుటుంబానికి మరణశాసనం అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇవి కూడా చదవండి...
ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మహిళలు మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి
Read Latest National News And Telugu News