Home » Lalu prasad yadav
బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి కల్పిస్తున్న జడ్ ప్లస్ సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తనపై, తన కుటుంబ సభ్యులపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు తోసిపుచ్చింది.
భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కేసులో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టులో శనివారంనాడు పిటిషన్ వేశారు. న్యాయమూర్తులు ఎంఎం సుందరేశ్, ఎన్.కోటేశ్వర్‌తో కూడిన ధర్మాననం దీనిపై ఈనెల 13న విచారణ జరుపుతుంది.
భూములు తీసుకుని ఉద్యోగాలిచ్చారనే ఆరోపణల కేసులో కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ ప్రసాద్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది.
తేజ్ ప్రతాప్‌పై గత ఏడాది మేలో ఆర్జేడీ బహిష్కరణ వేటు వేసింది. 12 ఏళ్లుగా తాను ఓ అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నట్టు ఫేస్‌బుక్ పోస్టులో తేజ్ ప్రకటించడంతో లాలూ కుటుంబంలో చిచ్చు రేగింది.
ఎంతో కష్టపడి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టిన వారి మూలాలను చెరిపేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తనను దిగ్భ్రాంతికి గురిచేసినట్టు రోహిణి ఆచార్య తెలిపారు. అజ్ఞానం అనే ముసుగు ఉన్నప్పుడు అహంకారం తలకెక్కుతుందని అన్నారు.
లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతితో సహా ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగానికి బదులుగా భూమిని స్వాధీనం చేసుకున్నట్టు బలమైన ఆధారాలున్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొంది.
లాలూ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ హాజరుకాగా, సీబీఐ తరఫున సీనియర్ అడ్వకేట్ డీపీ సింగ్ హాజరయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ పని చేసిన సమంయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణకు కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది.
లాలూ ప్రసాద్ కంటి శస్త్రచికిత్స విజయవంతమైందని, చికిత్సకు బాగా స్పందించారని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయంపై తేజస్వీని సాధుయాదవ్ తప్పుపట్టారు. తేజస్వి సలహాదారులకు ఏమాత్రం విషయం పరిజ్ఞానం లేదని అన్నారు.