Lalu Eye Surgery: లాలూకు విజయవంతంగా కంటి శస్త్రచికిత్స.. ఫోటో షేర్ చేసిన మిసా భారతి
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:53 PM
లాలూ ప్రసాద్ కంటి శస్త్రచికిత్స విజయవంతమైందని, చికిత్సకు బాగా స్పందించారని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) శనివారంనాడు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. స్థానిక 'సెంటర్ ఫర్ సైట్' ఆసుపత్రిలో జరిగిన క్యాటరాక్ట్, రెటీనర్ సర్జరీ విజయవంతమైందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సెంటర్ ఫర్ సైట్ గ్రూప్ ఐ ఆసుపత్రుల చైర్మన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మహిపాల్ సింగ్ సచ్‌దేవ్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది.
లాలూ ప్రసాద్ కంటి శస్త్రచికిత్స విజయవంతమైందని, చికిత్సకు బాగా స్పందించారని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. అడ్వాన్స్‌డ్ ఆప్థమాలిక్ టెక్నిక్స్ ఉపయోగించి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సర్జరీ పూర్తి చేసామని, సర్జరీ అనంతరం డిశ్చార్ చేశామని, ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని వెల్లడించాయి.
లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని ఆయన కుమార్తె మిసా భారతి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో అందరితో పంచుకున్నారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్ధించిన శ్రేయాభిలాషులు, వైద్య బృందం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 77 ఏళ్ల లాలూప్రసాద్ 2022 డిసెంబర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కిడ్నీని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య డొనేట్ చేశారు. ట్రాన్స్‌ప్లాంట్ అనంతరం ఆయన పలుమార్లు మెడికల్ చెకప్ కోసం ఢిల్లీ వచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఉపాధి హామీ పథకంపై బుల్డోజర్.. సోనియాగాంధీ ఫైర్
మేమిద్దరం వెళ్తాం.. ఢిల్లీ పర్యటనపై డీకే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి