Share News

Governor Ravi: గవర్నర్‌ రవి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Dec 20 , 2025 | 01:00 PM

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం.. ఆత్మహత్యల రాజధానిగా మారుతోంది.. అని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే గవర్నర్ కు, అధికార డీఎంకే పార్టీల మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. మళ్లీ.. గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై వివాదం ఎంతవరకు వస్తుందోననే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Governor Ravi: గవర్నర్‌ రవి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

- రాష్ట్రం.. ఆత్మహత్యల రాజధానిగా మారుతోంది..

- గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి

చెన్నై: రాష్ట్రం ఆత్మహత్యలకు రాజధానిగా మారుతోందని, జాతీయ నేరగణాంకాలను బట్టి ప్రతియేటా ఈ రాష్ట్రంలో 20 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో జాతి,, మత విధ్వేషాల కారణంగా పలు యుద్ధాలు జరుగుతున్నాయని, మానవులు మానసిక ఒత్తిడుల కారణంగా, వేర్పాటువాదంవల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నా రు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో శుక్రవారం ఉదయం ‘సింధూ సరస్వతి నాగరికత మహానాడు’ ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకు 65 మంది చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.


nani4.2.jpg

ఆత్మహత్యలను నిరోధించడానికి మానవుల జీవితాలను మెరుగుపరచడంతోపాటు దేశ సంస్కృతీ సంప్రదయాలు, ఆచరిస్తున్న సిద్ధాంతాలు గురించి ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్యులు, ద్రావిడులని ప్రజల్లో విబేధాలను సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిప్రయత్నాలు ఎన్నటికీ సఫలం కావని, కారణం వారి వద్ద అసత్యాలతో ఆచరణకు సాధ్యం కాని సిద్ధాంతాలే ఉన్నాయని గవర్నర్‌ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!

బ్యాంకింగ్‌ వదిలి చాక్లెట్‌ మేకింగ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2025 | 01:00 PM