Home » Governor of Tamil Nadu
గవర్నర్ ఆర్.ఎన్.రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ కొందరు సమాజంలోని ప్రజల మధ్య భయాందోళనలు రేకెత్తిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలాలు మారేకొద్దీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ తమిళనాడు రాష్ట్రంలో కొందరు మాట్లాడుతున్నారంటూ ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి దారితీశాయి..
దేశంలోని అన్ని ప్రాంతాలకు కాశితో సంబంధాలున్నాయని గవర్నర్ ఆర్‌ఎన్ రవి పేర్కొన్నారు. స్థానిక ఐఐటీ మద్రాసు క్యాంప్‌సలో ‘కాశి తమిళ సంఘం 4.0’ను సోమవారం గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... కాశి తమిళ సంగమం ప్రధాన మంత్రి మోదీ దీర్ఘకాల దృష్టి అన్నారు.
నాలుగేళ్లుగా గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన తిరుచ్చి శ్రీరంగం శాసనసభ నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయన్నారు.
ప్రజాధనం దోచుకుంటున్న డీఎంకేను అడ్డుకుంటున్నారన్న ఆగ్రహంతోనే రాష్ట్ర గవర్నర్‌ను ఆ పార్టీ శత్రువుగా పరిగణిస్తోందని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ పేర్కొన్నారు.
నగరంలో అద్దె ఆటో డ్రైవర్‌గా చాలీచాలని సంపాదనతో ఇద్దరు కుమార్తెలను పోషిస్తున్న అమల అనే మహిళకు గవర్నర్ ఆర్‌ఎన్ రవి కొత్త ఆటోను కానుకగా అందజేసి ఆమెకు విస్మయం కలిగించారు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాని, గవర్నర్ కార్యాలయమైన రాజ్‌భవన్‌ల మధ్య మళ్ళీ అగాదం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వానికా కొరకురాని కొయ్యగా మారిన గవర్నర్ ఆర్ ఎన్ రవి.. తాజాగా విడుదల చేసిన ప్రకటన పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. ఆ ప్రకటన సారాంశాన్ని ఓసారి పరిశీలిస్తే...
రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం తీవ్రంగా విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులతో మూడుసార్లు ‘జై శ్రీరామ్’ అని పలికించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు
తమిళనాడు రాష్ట్రంలో, గవర్నర్ ఆమోదం లేకుండా పది బిల్లులు చట్టరూపం దాల్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, ఈ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లు పరిగణించాలన్న తీర్పు ఇచ్చింది. ఇందులో, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల చాన్సలర్ పదవిని ముఖ్యమంత్రి కోసం మార్చడం, వివిధ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణలు ఉన్నాయి
Governor RN Ravi: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఆర్ ఎన్ రవి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో గవర్నర్ వ్యవహారం సరిగా లేదని మందలించింది.
రాష్ట్రప్రభుత్వానికి గవర్నర్(Governor) కట్టుబడి వుండాల్సిందేనని రాష్ట్ర న్యాయశాఖామంత్రి రఘుపతి వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ ధర్మాన్ని గౌరవించేలా ఆయా రాష్ట్రప్రభుత్వాలకు కట్టుబడి పని చేయాల్సిందేనని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తన ఎక్స్‌పేజీలో పోస్టు చేశారు.