Union Minister: కేంద్రమంత్రి సంచలన కామెంట్స్.. అందుకే డీఎంకేకు గవర్నర్ శత్రువు
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:54 PM
ప్రజాధనం దోచుకుంటున్న డీఎంకేను అడ్డుకుంటున్నారన్న ఆగ్రహంతోనే రాష్ట్ర గవర్నర్‌ను ఆ పార్టీ శత్రువుగా పరిగణిస్తోందని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ పేర్కొన్నారు.
- వారి అవినీతిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం
- కేంద్రమంత్రి మురుగన్
చెన్నై: ప్రజాధనం దోచుకుంటున్న డీఎంకేను అడ్డుకుంటున్నారన్న ఆగ్రహంతోనే రాష్ట్ర గవర్నర్‌ను ఆ పార్టీ శత్రువుగా పరిగణిస్తోందని కేంద్రమంత్రి ఎల్.మురుగన్(Union Minister L Murugan) పేర్కొన్నారు. కోవై మేట్టుపాళయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 2014వ సంవత్సరం కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించి నిధులు, పథకాల్లో సమన్యాయం పాటిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక జిల్లాగా గుర్తింపు పొందిన కోవైలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించే దిశగా బైపాస్ రోడ్డు, మేట్టుపాళయం-అవినాశి నాలుగు రోడ్ల విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నాలుగున్నరేళ్లకు పైగా అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి భారీస్థాయిలో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.

ఈ అవినీతిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న గవర్నర్‌ను అధికార పార్టీ నేతలు బద్దశత్రువుగా భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయని, అన్నాడీఎంకే కూటమిలో ఉన్న మిత్రపక్షాలను కూడగట్టుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే తమ ఏకైక లక్ష్యమని కేంద్రమంత్రి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రాజకీయం
Read Latest Telangana News and Nationa