Kavitha Urges Revanth Reddy: ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:10 AM
సీఎం సొంత జిల్లాతోపాటు దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై హామీతో కర్ణాటక నుంచి తిరిగి రావాలని సీఎం...
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సీఎం సొంత జిల్లాతోపాటు దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై హామీతో కర్ణాటక నుంచి తిరిగి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఉన్నందున.. వారి పార్టీ అధిష్ఠానంతో చర్చించి తెలంగాణకు నష్టం కలుగకుండా చూడాలని సోమవారం తన ఎక్స్ ఖాతాలో రాసిన పోస్టులో పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించి రాజకీయాలు మాట్లాడేందుకు కర్ణాటకకు వెళ్లిన సీఎం రేవంత్.. ఆల్మట్టి ఎత్తు పెంపుపై బెంగళూరులోనే తేల్చుకుని రావాలన్నారు. బెస్ట్ అవెలబుల్ పథకం కింద ప్రైవేటు స్కూళ్లలో విద్యాభ్యాసం చేస్తున్న పేద విద్యార్థుల బకాయి ఫీజులను చెల్లించాలని డిమాండ్ చేశారు.