Udayanidhi: డిప్యూటీ సీఎం ఉదయనిధి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:25 PM
నాలుగేళ్లుగా గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన తిరుచ్చి శ్రీరంగం శాసనసభ నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయన్నారు.
- నాలుగేళ్లుగా గవర్నర్‌తో ప్రభుత్వ పోరాటం
- ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి
చెన్నై: నాలుగేళ్లుగా గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన తిరుచ్చి శ్రీరంగం శాసనసభ నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయన్నారు. అయితే ఒక్కరు మాత్రం రెండు రోజుల క్రితం ప్రచారం చేపట్టారని, ఆయన మరెవరో కాదు, రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి అని అన్నారు.
‘
తమిళనాడు పోరాడుం, తమిళనాడు వెల్లుం’ అని మనం చెబుతుంటే, ‘నీంగళ్ యారుడన్ పోరాడ పోగిరీర్‌గళ్? యారై వెల్ల పోగీర్‌గళ్?’ అంటూ గవర్నర్ ప్రశ్నిస్తున్నారన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో పోరాడుతూనే ఉందని, తప్పకుండా తమిళనాడు పోరాడి గెలుస్తుందన్నారు. ఎడప్పాడి పళనిస్వామి లాగే ముఖ్యమంత్రి కూడా అణగిమణిగి ఉంటారని గవర్నర్ భావిస్తున్నారని, అయితే ఆ ఆశలు నెరవేరబోవన్నారు.
రాష్ట్రంలో డీఎంకే ఉన్నంత వరకు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతుందిని, ఫాసిస్ట్ శక్తులను ఎన్నడూ అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లో 200సీట్లు గెలుపే లక్ష్యంగా పార్టీ నేత లు, కార్యకర్తలు కృషిచేయాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!
Read Latest Telangana News and National News