Ind Vs NZ: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో విరాట్!
ABN , Publish Date - Jan 14 , 2026 | 09:44 AM
న్యూజిలాండ్-భారత జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ మరో హాఫ్ సెంచరీ చేస్తే ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో పడనుంది. వరుసగా ఆరు మ్యాచుల్లో అర్ధ శతకాలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశముంది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్-భారత జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ మరో హాఫ్ సెంచరీ చేస్తే ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో పడనుంది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 91 బంతులు ఎదుర్కొని 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ వరుసగా ఐదు వన్డేల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ విషయంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, అజింక్య రహానేతో సమానంగా నిలిచాడు. విరాట్ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. వరుసగా ఆరు మ్యాచుల్లో అర్ధ శతకాలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశముంది.
విరాట్ కోహ్లీ(Virat Kohli) తన చివరి ఐదు వన్డేల్లో 156.33 యావరేజ్‌తో 469 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, మూడు అర్ధశతకాలు ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచుల్లో 131, 77 రన్స్ చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో విరాట్ 7 సార్లు 50 ప్లస్ స్కోర్స్ చేశాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 135.4 యావరేజ్‌తో 677 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు అర్ధశతకాలున్నాయి.
ఇవి కూడా చదవండి:
మరో 34 పరుగుల దూరంలో.. రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
గంభీర్‌తో రో-కోకు ఎలాంటి విభేదాలు లేవు.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు