Ind Vs NZ: ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: శుభ్‌మన్ గిల్
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:30 AM
రాజ్‌కోట్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ గిల్.. జట్టు ఓటమిపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: రాజ్‌కోట్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కి భారత బ్యాటర్లు.. కాస్త తడబడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(56) హాఫ్ సెంచరీ, కేఎల్ రాహుల్(112*) సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లంతా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బౌలింగ్‌లోనూ అధికంగా పరుగులు ఇచ్చేయడంతో కివీస్ విజయం లాంఛనమైంది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ గిల్(Shubman Gill).. జట్టు ఓటమిపై స్పందించాడు.
‘మేం మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడమే మా ఓటమికి కారణమైంది. సర్కిల్‌లో ఐదుగురు ఫీల్డర్లు ఉన్నప్పుడు వికెట్లు తీయకపోతే మ్యాచ్ గెలవడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ మేం 15-20 పరుగులు అదనంగా చేసినా ఓడిపోయేవాళ్లమే. క్రీజులో సెట్ అయిన బ్యాటర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాల్సింది. బౌలింగ్‌లో మాకు మంచి ఆరంభమే లభించింది. కానీ కివీస్ బ్యాటర్లు మిడిల్ ఓవర్లలోనే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. తొలి 15 ఓవర్లలో బంతి బాగానే స్పందించింది. ఆ తర్వాత వికెట్ సెట్ అయింది. కానీ మేం మరింత మెరుగ్గా ఆడి మరిన్ని అవకాశాలను సృష్టించాల్సింది. గత మ్యాచులో మేం కొన్ని క్యాచ్‌లు నేలపాలు చేశాం. కానీ ఈ మ్యాచులో మెరుగ్గా రాణించాం. ఫీల్డింగ్‌లో మెరుగవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అవకాశాలను అందుకోకపోతే మ్యాచ్‌లను గెలవలేం’ అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
బదోని ఎంపికపై తీవ్ర విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో విరాట్!