Under 19 World Cup: కుర్రాళ్లు ‘సిక్సర్’ కొడతారా
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:04 AM
ఐసీసీ అండర్-19 పురుషుల వన్డే వరల్డ్ కప్ గురువారం ఇక్కడ ప్రారంభం కానుంది. తమ ప్రతిభా పాటవాలకు పరీక్షగా నిలిచే ఈ టోర్నీలో ఆరోసారి టైటిల్ గెలిచి రికార్డు సృష్టించాలని...
మ. 1 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఆరో టైటిల్‌పై కన్నేసిన భారత్
తొలి పోరులో యూఎ్‌సఏతో ఢీ
నేటినుంచే అండర్-19 వరల్డ్ కప్
బులవాయో: ఐసీసీ అండర్-19 పురుషుల వన్డే వరల్డ్ కప్ గురువారం ఇక్కడ ప్రారంభం కానుంది. తమ ప్రతిభా పాటవాలకు పరీక్షగా నిలిచే ఈ టోర్నీలో ఆరోసారి టైటిల్ గెలిచి రికార్డు సృష్టించాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో తొలిరోజు జరిగే గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో అమెరికా జట్టును యువ భారత్ ఢీకొననుంది. ఇప్పటిదాకా 16సార్లు టోర్నీ జరిగితే ఐదుసార్లు (2000, 2008, 2012, 2018, 2022) విజేతగా నిలవడం ద్వారా భారత్ తన ఆధిపత్యాన్ని చాటి చెప్పింది. చివరిగా 2024లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి భారత్ రన్నర్‌పగా నిలిచింది. ఈసారి ఆయుష్ మాత్రే సారథ్యంలో భారత్ బరిలో దిగుతోంది. ఇక..14 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలిచింది. తొలి రోజు ఇతర మ్యాచ్‌ల్లో జింబాబ్వే-స్కాట్లాండ్, టాంజానియా-వెస్టిండీస్ తలపడనున్నాయి.
ఇదీ టోర్నీ ఫార్మాట్: 16 జట్లు 4 గ్రూపులుగా విడిపోయి పోటీపడుతున్నాయి. సింగిల్ రౌండ్ రాబిన్ లీగ్‌లో ప్రతి గ్రూపులో తొలి మూడు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్‌లో 12 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాలు పొందే జట్లు సెమీస్ చేరతాయి. ఫిబ్రవరి 6న ఫైనల్ జరుగుతుంది.
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..