Rohit Sharma: మరో మైలురాయి తాకిన రోహిత్ శర్మ
ABN , Publish Date - Jan 15 , 2026 | 11:27 AM
టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ మరో మైలురాయిని తాకాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో ఈ ఫీట్ ను సాధించాడు. ఆసియాలోనే 7000 వన్డే పరుగులు చేసిన వారి జాబితాలో రోహిత్ శర్మ తన పేరును లిఖించుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ...
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే అనేక ఘనతలు సాధించిన హిట్ మ్యాన్ మరో అరుదైన మైలురాయిని(Rohit Sharma records Asia)దాటాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో ఈ ఫీట్‌ను సాధించాడు. ఆసియా ఖండంలో 7000 (ప్రస్తుతం 7,019) వన్డే పరుగులు పూర్తి చేసుకున్నఏడో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 162 ఇన్నింగ్స్ లో ఈ మైలు రాయిని రోహిత్ అందుకున్నాడు. రోహిత్ కంటే ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, శ్రీలంక స్టార్ ప్లేయర్లు కుమార సంగక్కర, సనత్ జయసూర్య, మహేళ జయవర్దనే వన్డేల్లో ఆసియాలో ఏడు వేల పరుగుల మైలురాయిని తాకారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... తొలి వన్డేలో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు..రాజ్ కోట్(IND vs NZ Rajkot ) వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో చుక్కెదురైంది. న్యూజిలాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిని చూవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (112 నాటౌట్)(KL Rahul century) సూపర్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) అర్ధ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జెమీసన్, ఫోక్స్, లెనాక్స్, బ్రేస్‌వెల్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. డారిల్ మిచెల్(Daryl Mitchell) (131 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో న్యూజిలాండ్ విజయంలో కీలపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్, యంగ్‌ను ఔట్ చేయలేకపోయారు. హర్షిత్, ప్రసిద్ద్ మాత్రమే తలో వికెట్ తీశారు. కాగా, ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరుగనుంది.
ఇవి కూడా చదవండి:
11 ఏళ్ల రికార్డు.. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్!
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: శుభ్‌మన్ గిల్