CM Revanth: ఈ సంక్రాంతి చరిత్రను తిరగరాసింది: సీఎం రేవంత్
ABN , Publish Date - Jan 15 , 2026 | 10:54 AM
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాపాలనలో ఈ సంక్రాంతి చరిత్రను తిరగరాసిందని అన్నారు.
హైదరాబాద్, జనవరి 15: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. అందమైన రంగవల్లులు, పిండివంటలతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. పతంగులు ఎగురవేస్తూ చిన్నా, పెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొంటున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రధాన నరేంద్ర మోదీ (PM Modi) సహా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ విషెస్ తెలియజేశారు. ప్రజాపాలనలో ఈ సంక్రాంతి చర్రితను తిరగరాసిందని సీఎం అన్నారు.
సీఎం రేవంత్ ట్వీట్..
‘రైతన్నల ఆరుగాలం కష్టం పంటగా చేతికి వచ్చే పండుగ సంక్రాంతి. ప్రజాపాలనలో ఈ సంక్రాంతి చరిత్రను తిరగరాసింది. ఈ సీజన్‌లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేశాం. అన్నదాతకు అండగా నిలిచాం. ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
నౌకాయాన రంగంలో భారత్ అరుదైన ఘనత
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Read Latest Telangana News And Telugu News