Indian origin cricketers: కెనడా జట్టు కెప్టెన్‌గా భారత సంతతి వ్యక్తి
ABN , Publish Date - Jan 15 , 2026 | 03:07 PM
టీ20 ప్రపంచకప్-2026 కోసం ఎంపిక చేసిన రెండు విదేశీ జట్లకు భారతీయ సంతతి ఆటగాళ్లు కెప్టెన్లుగా ఎంపికయ్యారు. కెనడా జట్టు కెప్టెన్‌గా దిల్‌ప్రీత్ బజ్వా ఎంపికయ్యాడు. అలానే ఒమన్ జట్టు కెప్టెన్‌గా జతిందర్ సింగ్ ను ఆ దేశ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ రెండు జట్లలో భారతీయుల సంఖ్య అధికంగా ఉంది.
స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ క్రికెట్ లో భారతీయ మూలాలు(Indian origin cricketers) ఉన్న వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా దేశాల క్రికెట్ జట్లలో భారతీయ సంతతి ఆటగాళ్లు ప్రాతినిథ్యం వస్తున్నారు. దాదాపు అన్ని ఐసీసీ సభ్య దేశాలు, అసోసియేట్ దేశాల జట్లలో భారతీయ ప్లేయర్లు ఉన్నారు. న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లలో చాలాకాలం నుంచే భారతీయులకు ప్రాతినిథ్యం లభిస్తూ వస్తుంది. చాలా ఏళ్లుగా భారత మూలాలున్న కనీసం ఒక్క ఆటగాడైనా ఈ జట్లలో ఉంటూ వస్తున్నాడు. ఇటీవలి కాలంలో దక్షిణాఫ్రికా క్రికెట్‌లో సైతం భారత సంతతి ప్లేయర్లు అవకాశాలు దక్కించుకుంటున్నారు. నెదర్లాండ్స్, అమెరికా, ఒమన్, కెనడా దేశాల జట్లలో అయితే సగానికి పైగా భారతీయులే ఉంటున్నారు.
తాజాగా టీ20 ప్రపంచకప్-2026 కోసం ఎంపిక చేసిన రెండు విదేశీ జట్లకు భారత సంతతి ఆటగాళ్లు కెప్టెన్లుగా ఎంపికయ్యారు. కెనడా జట్టు కెప్టెన్‌గా దిల్‌ప్రీత్ బజ్వా(Dilpreet Bajwa) ఎంపికయ్యాడు. అలానే ఒమన్ జట్టు కెప్టెన్‌గా జతిందర్ సింగ్ ను ఆ దేశ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ రెండు జట్లలో భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఒమన్ జట్టులో సగానికి పైగా భారత మూలాలున్న ప్లేయర్లే ఉన్నారు. అలానే తాజాగా ప్రకటించిన కెనడా జట్టులో సైతం అదే స్థాయిలో ఇండియన్స్ ఉన్నారు. వీరే కాక న్యూజిలాండ్ జట్టులో ఐష్ సోధి, రచిన్ రవీంద్ర, నెదర్లాండ్ జట్టులో ఆర్యన్ దత్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. అలానే సౌతాఫ్రికా జట్టులో కేశవ్ మహారాజ్ లాంటి భారత మూలాలున్న ప్లేయర్ చోటు దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా చూస్తే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారతీయ మూలాలున్న ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభిస్తుంది.
కెనడా ప్రపంచ కప్ 2026 జట్టు:
దిల్‌ప్రీత్ బజ్వా (కెప్టెన్), అజయ్‌వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ ఠాకర్, జస్కరన్‌దీప్ బుట్టార్, కలీమ్ సనా, కన్వర్‌పాల్ తత్గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయస్ మొవ్వ, యువరాజ్ సమ్రా
ఇవి కూడా చదవండి:
11 ఏళ్ల రికార్డు.. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్!
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: శుభ్‌మన్ గిల్