Share News

U19 WC 2026: టాస్ గెలిచిన భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:45 PM

టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో ఐసీసీ టోర్నీ సిద్ధమైంది. అదే అండర్ 19 వన్డే ప్రపంచ కప్. తొలి రోజు టీమిండియా.. అమెరికా జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత అమెరికా జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

U19 WC 2026: టాస్ గెలిచిన భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
U19 WC 2026

ఇంటర్నెట్ డెస్క్: కుర్రాళ్ల సమరానికి వేళైంది. టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో ఐసీసీ టోర్నీ సిద్ధమైంది. అదే అండర్ 19 వన్డే ప్రపంచ కప్. తొలి రోజు టీమిండియా.. అమెరికా జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత అమెరికా జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ టోర్నీలో భారత్‌కు అదిరే రికార్డు ఉంది. ఇప్పటికే ఐదు సార్లు అండర్ 19 వన్డే ప్రపంచ కప్(U19 World Cup 2026) టైటిల్‌ను కుర్రాళ్లు ముద్దాడారు. మరి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోన్న భారత యువ జట్టు అంచనాలను నిలబెట్టుకుని.. దేశానికి ఆరో కప్పును అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఈ టోర్నీలో అందరి దృష్టి యువ సంచలనం.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. మరి వైభవ్ అదరగొడతాడా? అనేది చూడాల్సి ఉంది.


భారత తుది జట్టు: ఆయుష్‌ మాత్రే (కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, వేదాంత్‌ త్రివేది, విహాన్‌ మల్హోత్ర, అభిజ్ఞాన్‌ కుందు (వికెట్‌ కీపర్‌), హర్వాన్ష్‌ పంగాలియా, ఆర్‌ఎస్‌ అంబ్రిష్‌, కాన్షిక్‌ చౌహాన్‌, హెనిల్‌ పటేల్‌, దీపేశ్‌ దేవేంద్రన్‌, ఖిలాన్‌ పటేల్‌


యూఎస్‌ఏ తుది జట్టు: సాహిల్‌ గార్గ్‌, అమరీందర్‌ గిల్‌, అర్జున్‌ మహేష్‌ (వికెట్‌ కీపర్‌), ఉత్కర్ష్‌ శ్రీ వాస్తవ(కెప్టెన్‌), రిత్విక్‌ అప్పిడి, అద్నిత్‌ జాంబ్‌, అమోఘ్‌ ఆరెపల్లి, నితీశ్‌ సుదిని, శబరీష్‌ ప్రసాద్‌, అదిత్‌ కప్పా, రిషబ్‌ షింపి


ఇవి కూడా చదవండి:

11 ఏళ్ల రికార్డు.. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్!

ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: శుభ్‌మన్ గిల్

Updated Date - Jan 15 , 2026 | 01:21 PM