India Versus New Zealand 3rd ODI: బౌలింగ్ వ్యూహం మారాల్సిందే
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:12 AM
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నిర్ణాయక మూడో వన్డే ఆదివారం ఇక్కడ జరగనుంది. అయితే సిరీస్ చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా..తన బౌలింగ్ వ్యూహాలపై...
ఇండోర్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నిర్ణాయక మూడో వన్డే ఆదివారం ఇక్కడ జరగనుంది. అయితే సిరీస్ చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా..తన బౌలింగ్ వ్యూహాలపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. తొలి రెండు వన్డేలలో భారత స్పిన్నర్లను న్యూజిలాండ్ బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. మరోవైపు ప్రత్యర్థి స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం మన బ్యాటర్లకు కష్టమైపోయింది. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో నెగ్గిన కివీస్ సిరీ్‌సను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే. మధ్య ఓవర్లలో భారత బౌలర్ల వైఫల్యం రాజ్‌కోట్‌లో మరోసారి కొట్టొచ్చినట్టు కనిపించింది. మిస్టరీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను న్యూజిలాండ్ ఆటగాళ్లు సులువుగా ఎదుర్కోవడం గమనార్హం. ఇక..బ్యాటర్లకు అనుకూలించే ఇండర్‌లో బౌండరీ విస్తీర్ణం కూడా తక్కువగా ఉంటుంది. ఈనేపథ్యంలో బౌలింగ్‌లో వైవిధ్యం కన్నా..క్రమశిక్షణగా బంతులు వేయడం ముఖ్యం. అందుకు వికెట్లను లక్ష్యంగా చేసుకొని కుల్దీప్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గాయంతో వాషింగ్టన్ సుందర్ దూరం కావడం రాజ్‌కోట్ మ్యాచ్‌పై ఎంతో ప్రభావం చూపింది. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన నితీశ్ కుమార్ కేవలం రౌండు ఓవర్లే వేశాడు. ఇండోర్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే తుది జట్టులో ఆఫ్ స్పిన్నర్ ఆయుష్ బదోనికి స్థానం కల్పిస్తారేమో చూడాలి. పేస్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఎడమ చేతి వాటం బౌలర్ అర్ష్‌దీ్‌పను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ప్రసిద్ధ్‌ను పక్కనపెట్టాల్సి ఉంటుంది. కాగా..
భారత జట్టు శుక్రవారంనాడు ప్రాక్టీ్‌సకు దురంగా ఉండగా, న్యూజిలాండ్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.
అర్షదీప్పై ఎందుకిలా?
న్యూజిలాండ్‌తో మొదటి రెండు వన్డేలకు పేసర్ అర్షదీప్ ను పక్కపెట్టడంపై మాజీ స్పిన్నర్ అశ్విన్ భారత జట్టు యాజమాన్యాన్ని నిలదీశాడు. ‘జట్టుకు ఎన్నో సేవలందించిన అర్ష్‌దీప్ తుది 11 మందిలో స్థానానికి పోరాటం చేయాల్సి రావడమా? ఒక మ్యాచ్ ఆడితే రెండో పోటీలో అతడికి చోటు దక్కడం లేదు. మీరు కారణాలు ఎన్ని చెప్పినా అది అతడి విశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. బౌలర్లకే అన్నిసార్లు ఎందుకిలా జరుగుతున్నది. బ్యాటర్లకు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాదు’ అని అశ్విన్ దుయ్యబట్టాడు.
ఇవి కూడా చదవండి:
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్